Jharkhand CM : బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది
సీఎం హేమంత్ సోరేన్ షాకింగ్ కామెంట్స్
Jharkhand CM : ప్రజలు రేషన్ ను కొంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్.
సోమవారం రాష్ట్ర శాసనసభలో బల పరీక్షకు దిగారు. విశ్వాస పరీక్షను ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం(Jharkhand CM) సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని కూల్చడమే పనిగా కేంద్రం పెట్టుకుందంటూ ఆరోపించారు.
కానీ వారు నన్ను తొలగించాలని ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాదని తేలి పోయిందన్నారు. అత్యంత దుర్మార్గమైన పద్దతులను అవలంభిస్తోందన్నారు.
ఇదిలా ఉండగా ఒక వేళ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడితే సీఎంగా కొనసాగలేరు. కానీ ఆరు నెలల లోపు తిరిగి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.
అధికార జార్ఖండ్ ముక్తీ మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే పనిగా బీజేపీ పెట్టుకుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్దం లాంటి పరిస్థితిని సృష్టించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.
తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కుట్ర పన్నారని ఫైర్ అయ్యారు. జార్ఖండ్(Jharkhand CM) ఎమ్మెల్యేల కొనుగోలు చేయడంలో పాలు పంచుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నన్ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నాయి. వల పన్నాయి. కానీ వారు స్వంత వలలో చిక్కు కోవడం ఖాయమన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఉన్న పద్దతిని అనుసరిస్తోంది. జార్ఖండ్ లో కూడా ప్లాన్ చేశారు. కానీ వర్కవుట్ కాలేదన్నారు. తమ బలం ఏమిటో తెలియ చెప్పేందుకే విశ్వాస పరక్షకు సిద్దమైనట్లు ప్రకటించారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ