Sharad Pawar : పవార్ కామెంట్స్ పై బీజేపీ గరం గరం
అమితాబ్..మాధురి సంగతేంటి
Sharad Pawar : సినీ రంగానికి సంబంధించి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయనపై నిప్పులు చెరిగింది భారతీయ జనతా పార్టీ. దాదా సాహెబ్ ఫాల్కే బాలీవుడ్ ను స్థాపించారని ఆ విషయం మరిచి పోయి మాట్లాడితే ఎలా అని పేర్కొన్నారు బీజేపీ నేత రామ్ కదమ్.
టెర్రరిస్టులకు మతం లేదు కానీ కళ, సినిమా ఉందా అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనాలా ట్వీట్ చేశారు. బాలీవుడ్ కు ముస్లిం సమాజానికి చెందిన కళాకారులు అత్యధిక సహకారం అందించారంటూ కితాబు ఇచ్చారు శరద్ పవార్(Sharad Pawar). దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది.
మరి ఇంత కాలం అద్భుత నటనా ప్రతిభతో రాణిస్తూ వస్తున్న హిందూ కళాకారుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు రామ్ కదమ్, పూనావాలా. పవార్ చేసిన ప్రకటన అత్యంత జుగుస్సాకరంగా ఉందన్నారు. ఆయనకు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్ కనిపించడం లేదంటూ ప్రశ్నించారు.
ఎన్సీపీ చీఫ్ ఓటు బ్యాంకు పేరుతో కళ, సినిమాను ఎందుకు విభజిస్తున్నారంటూ నిలదీశారు. దాదా సాహెబ్ ఫాల్కే, కిషోర్ కుమార్ , లతా మంగేష్కర్ , స్మితా పాటిల్, ఆషా భోంస్లే తదితరులంతా బాలీవుడ్ కు పేరు తీసుకు రాలేదని అనుకుంటున్నారా అంటూ పవార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అయితే నిప్పులు చెరిగారు. ఆయనకు ఓట్లు కావాలి సీట్లు కావాలి కానీ సినిమా రంగం పచ్చగా ఉంటే భరించ లేరంటూ మండిపడ్డారు వివేక్ అగ్నిహొత్రి. డి – కంపెనీతో లింకు ఉన్న మంత్రి పార్టీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని పేర్కొన్నారు పూనావాలా.
Also Read : డీల్ కుదుర్చు కోవాలంటూ లేఖలు