Munugodu By Poll Counting : రౌండ్ రౌండ్ కు నువ్వా నేనా
ఒకటి తప్ప 2,3,4 రౌండ్లలో ఆధిక్యం
Munugodu By Poll Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రౌండ్ రౌండ్ కు అధికార టీఆర్ఎస్ , భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. మొదటి రౌండ్ లో అధికార పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే ఊహించని రీతిలో రెండు, మూడు, నాలుగో రౌండ్లలో సీన్ మారింది.
ఊహించని రీతిలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఆధిక్యం వచ్చింది. ఇరువురి మధ్య స్వల్ప ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ కు మొదటి రౌండ్ లో 34 ఓట్లు పోల్(Munugodu By Poll Counting) అయ్యాయి.
ఇప్పటి వరకు చౌటుప్పల్ మండలం పూర్తయింది. ఐదవ రౌండ్ సంస్థాన్ నారాయణపురం మండలానికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డి వారి గ్రామంలో బీజేపీకి ఓట్లు పడడం విశేషం. ఇక మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జిగా ఉన్న లింగోజిగూడెంలోనూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.
నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 700 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ కు 21,489 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21, 175 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 5,718 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,390 ఓట్లు రాగా బీజేపీకి 7,426 ఓట్లు వచ్చాయి. బీజేపికి ఇక్కడ 36 ఓట్లు లీడ్ ఇచ్చింది. రెండో రౌండ్ లో బీజేపీకి 318 కోట్ల ఆధిక్యం వచ్చింది.
బీజేపీకి 13, 859 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 14,177 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కు 3,597 కోట్లు పోల్ అయ్యాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,478 ఓట్లు రాగా బీజేపీకి 5,126 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థికి 2,100 కోట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి లీడ్ వచ్చింది.
Also Read : మునుగోడు కౌంటింగ్ వద్ద 144 సెక్షన్