Kaushik Hari Joins : బీజేపీకి గుడ్ బై బీఆర్ఎస్ కు జై
కేటీఆర్ సమక్షంలో చేరిన కౌశిక్ హరి
Kaushik Hari Joins : తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రకటన వెలువడనే లేదు. కానీ ఆయా పార్టీలకు చెందిన నాయకులు గోడ దూకుతున్నారు. ఎక్కడ తమకు పదవులు వస్తాయోనని ప్లాన్ చేస్తున్నారు. ముందస్తుగా సీట్లు కన్ ఫర్మ్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ లోకి చేరికల పర్వం మొదలైంది. నిన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండి ఖమ్మం జిల్లాలో కీలకమైన నాయకుడిగా పేరు పొందిన వెంకట్రావు ఉన్నట్టుండి మాజీ ఎంపీ పొంగులేటి వెంట కాంగ్రెస్ లోకి వెళ్లారు.
Kaushik Hari Joins BRS
అక్కడ కొన్ని రోజులు ఉన్న ఆయన మనసు మార్చుకున్నారు. తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. అతడిని తిరిగి స్వంత పార్టీలోకి వచ్చేలా చేయడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు. నిన్న కండువా కప్పుకున్నారు. తాజాగా రామగుండం భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేతగా గుర్తింపు పొందారు కౌశిక్ హరి(Kaushik Hari Joins). ఆయన కూడా జంప్ అయ్యారు. 2009లో ప్రజా రాజ్యం నుంచి పోటీ చేశారు. కేవలం 1200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రగతి భవన్ లో ఆయన దర్శనం ఇచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరేందుకు ఓకే చెప్పారు. త్వరలోనే రామగుండంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కౌశిక్ హరి తో పాటు పలువురు బీజేపీ సీనియర్లు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Also Read : CM KCR Attend : బహ్మానందం కుమారుడి పెళ్లికి కేసీఆర్