BJP Electoral Bonds : బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 5,270 కోట్లు
దేశంలో టాప్ లో వసూళ్లు..కోట్లే కోట్లు
BJP Electoral Bonds : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కాసుల పంట పండిస్తోంది. 2018-2022 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ ఏకంగా రూ. 5,270 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్ బాండ్లు ఆయా రాజకీయ పార్టీలకు కల్పతరువుగా మారాయి.
అపరిమితమైన డబ్బును విరాళంగా అందించడంలో సహాయ పడ్డాయి. గత ఏడాది 2022 వరకు విక్రయించిన మొత్తం రూ. 9,208 కోట్లలో రూ. 5, 270 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ పొందింది. మార్చి 2018 నుంచి 2022 మధ్య కొనుగోలు చేసిన రాజకీయ పార్టీలకు అపరిమితమైన మొత్తంలో డబ్బును విరాళంగా అందించడంలో కంపెనీలకు సాయపడే వివాదాస్పద ఆర్థిక సాధనం. ఎలక్టోరల్ బాండ్లలో(BJP Electoral Bonds) సగానికి పైగా బీజేపీకి అందాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.
రాజకీయ పార్టీలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం రూ. 9,208 కోట్లలో రూ. 5,270 కోట్లు లేదా 2022 వరకు విక్రయించిన మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 57 శాతం భారతీయ జనతా పార్టీ పొందింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అదే కాలంలో రూ. 964 కోట్లు , అంటే కేవలం 10 శాతం మాత్రమే అందుకుంది.
పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ పార్టీ రూ. 767 కోట్లు పొందింది. మొత్తంలో 8 శాతం పొందింది. మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,033 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను , 2021లో రూ.22.38 కోట్లు, 2020లో రూ. 2,555 కోట్లు , 2019లో రూ, 1450 కోట్లు, 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 210 కోట్ల రషీదులను కూడా బీజేపీ పొందింది.
2022 ఆర్థిక సంవత్సరలో బాండ్ల ద్వారా కాంగ్రెస్ రూ. 253 కోట్లు, 2021లో రూ. 10 కోట్లు, 2020లో రూ. 317 కోట్లు , 2019లో రూ. 381 కోట్లు అందాయి. టీఎంసీ
Also Read : వికీపీడియాపై ఆధార పడితే ఎలా