Ashwath Narayan : సీఎంపై కావాలని కామెంట్స్ చేయలేదు
బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ కామెంట్స్
Ashwath Narayan : కర్ణాటక ఎన్నికల సందర్భంగా సీఎం సిద్దరామయ్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్(Ashwath Narayan). తాము తిరిగి రెండోసారి పవర్ లోకి వస్తామని సిద్దరామయ్యను లేకుండా చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా కేవలం మోదీని అన్నందుకే రాహుల్ గాంధీపై వేటు వేసింది కేంద్రం. మరి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా భౌతికంగా ఉండకుండా చేస్తామంటే స్పందించక పోవడం విశేషం.
అనుచిత కామెంట్స్ చేసిన అశ్వత్ నారాయణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్యను , ఆయన మనో భావాలను దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కావాలని రాజకీయం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే. తన వ్యాఖ్యలు సాధారణంగా చేసినవే తప్పా దురుద్దేశ పూర్వకంగా కాదని స్పష్టం చేశారు అశ్వత్ నారాయణ్.
ఇదిలా ఉండగా ఆయన బీజేపీ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. పార్టీ కూడా వివరణ కోరిందని, దానికి తాను వివరణాత్మక సమాధానం ఇచ్చానని చెప్పారు అశ్వత్ నారాయణ్. కాగా తాను న్యాయ పరంగా తేల్చుకుంటానని తెలిపారు. తనపై కావాలని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు అశ్వత్ నారాయణ్. ప్రస్తుతం ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే పై కూడా కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Also Read : WFI Chief