BJP MLA Paolienlal Haokip : మోదీపై బీజేపీ ఎమ్మెల్యే హౌకిప్ ఫైర్
అపాయింట్‌మెంట్ ఇవ్వని మోదీ
BJP MLA Paolienlal Haokip : మణిపూర్ లో చోటు చేసుకుంటున్న ఘటనలు యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పౌలియన్ లాల్ హౌకిప్(BJP MLA Paolienlal Haokip) సంచలన కామెంట్స్ చేశారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవాలని అపాయింట్ మెంట్ కోరామని ఇప్పటి వరకు అనుమతి రాలేదన్నారు. వీడియో వైరల్ కాకుంటే ప్రధాని మాట్లాడే వారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Paolienlal Haokip Said
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా నా ప్రాణానికి భద్రత లేదని వాపోయారు. కేవలం కేంద్ర భద్రతా బలగాల కారణంగానే తామంతా సేఫ్ గా ఉన్నామని చెప్పారు. హౌకిప్ జాతీయ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రాధాన్యతలు తప్పుగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
మణిపూర్ లో ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన వీడియో ఈశాన్య రాష్ట్రంలో చోటు చేసుకున్న భయంకరమైన పరిస్థితులను తెలియ చేసింది. దీనిపై సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చురచంద్ పూర్ జిల్లాలోని సైకోట్ నియోజకవర్గానికి బీజేపీ తరపున హకీప్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే హౌకిప్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాగా ఇప్పటి వరకు మణిపూర్ లో దారుణాలు ఆగడం లేదు. 150 మందికి పైగా మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులుగా మరారు.
Also Read : Kollu Ravindra : కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న నాని