Harsimrat Kaur : హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ కు కేంద్రం బిగ్ షాక్

బంగ్లా ఖాళీ చేయాలంటూ ఆదేశం

Harsimrat Kaur :  శిరోమ‌ణి అకాళీద‌ళ్ నాయ‌కురాలు హ‌ర్ సిమ్ర‌త్ కౌర్(Harsimrat Kaur)  కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం. ఢిల్లీలోని బంగ్లాలో ఉంటున్న ఆమెను వెంట‌నే ఖాళీ చేయాల‌ని ఆదేశించారు.

హౌసింగ్ అండ్ అర్బ‌న్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని డైరెక్ట‌రేట్ ఆఫ్ ఎస్టేట్స్ కు సంబంధించి స‌ఫ్ద‌ర్ జంగ్ రోడ్ బంగ్లాను కేంద్ర పంచాయ‌తీరాజ్ శాఖ స‌హాయ హంత్రి క‌పిల్ మోరేశ్వ‌ర్ పాటిల్ కు కేటాయించిన‌ట్లు మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఇక హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ దాదాపు 25 సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డే ఉన్నారు. దీంతో న్యూ ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లో ఉన్న కొత్త వ‌స‌తి గృహంలోకి మార‌నున్నారు.

ఆమె ప్ర‌స్తుతం ఉంటున్న బంగ్లా ఎనిమిదో ర‌కం బంగ్లా. ఇది కేబినెట్ మంత్రులు, ఇత‌రుల‌కు కేటాయించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఆమెకు రూల్స్ ప్ర‌కారం 76, లోధి ఎస్టేట్ లో టైప్ -7 కింద బంగ్లా ఇచ్చామ‌ని పేర్కొంది.

హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్దు కోరుతూ రైతుల‌కు మ‌ద్ద‌తుగా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

కొత్త వ‌స‌తిని సాంకేతికంగా స్వాధీనం చేసుకున్నారు. సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్ మెంట్ మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను పూర్తి చేశాక త‌ర‌లిస్తారు.

ఇదిలా ఉండ‌గా అట‌ల్ జీ పీఎంగా ఉన్న స‌మ‌యంలో హ‌ర్ సిమ్ర‌త్(Harsimrat Kaur)  భ‌ర్త శిరోమ‌ణి అకాళీ ద‌ళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ కు 1998లో స‌ఫ్ద‌ర్ జంగ్ రోడ్ బంగ్లా కేటాయించారు. భ‌టిండా నుండి లోక్ స‌భ ఎంపీ అయ్యాక హ‌ర్ సిమ్ర‌త్ కు కేటాయించారు.

Also Read : బీజేపీ నాయ‌కురాలు సీమా పాత్ర అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!