MLC Kavitha : బీజేపీ ఆఫర్ డోంట్ కేర్ – కల్వకుంట్ల కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కామెంట్స్
MLC Kavitha : తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ పూర్తి అబద్దమని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బక్వాస్ మాటలు మాట్లాడటం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.
తాను టీఆర్ఎస్ లో ఉన్నానని, తన తండ్రి ముఖ్యమంత్రి, తన అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఇంకెందుకు తాను ఇతర పార్టీల వైపు చూస్తానని ప్రశ్నించారు. మా పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగమన్నారు. ఇక లిక్కర్ స్కాంకు సంబంధించి ఏదైనా ఉంటే విచారణ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఇక భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనకు ప్రపోజల్స్ వచ్చాయని, కానీ తాను తిరస్కరించానని చెప్పారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). తమ పార్టీ జాతీయ పార్టీగా మారింది. ఆ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఎంపీకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు.
మరి ఆయన బీజేపీలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించిన వారితో ఎలా మాట్లాడాడో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంటుందన్నారు. కానీ ఏదీ తెలుసు కోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎంపీ అరవింద్ ను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కల్వకుంట్ల కవిత(MLC Kavitha) హెచ్చరించారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతున్న భాష వల్ల నిజామాబాద్ జిల్లా పరువు పోతోందన్నారు.
Also Read : విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు