Manish Sisodia : కావాల‌నే బీజేపీ ఓట‌ర్ల‌ను తొల‌గించింది

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఫైర్

Manish Sisodia : ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దొడ్డి దారిన గెల‌వాల‌ని ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను జాబితా నుంచి తొల‌గించిందంటూ ఫైర్ అయ్యారు. ఆదివారం దేశ రాజ‌ధానిలో ఎంసీడీ ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ కొన‌సాగుతోంది.

విచిత్రం ఏమిటంటే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు అనిల్ చౌద‌రి తాను ఓటు వేసేందుకు వెళ్లారు బూత్ వ‌ద్ద‌కు . చూస్తే ఆయ‌న ఓటు లిస్టులో లేదు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు. కావాల‌నే త‌న ఓటు తొల‌గించార‌ని , ఎన్నికల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తాన‌ని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలో 250 బూత్ లు ఉన్నాయి.

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. సాయంత్రం 5.30 గంట‌ల దాకా కొన‌సాగుతుంది. అంత‌కు ముందు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న కుటుంబీకుల‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆయ‌నతో పాటు ఆప్ ప్ర‌ముఖులు కూడా ఓటు వేశారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) మీడియాతో మాట్లాడారు.

కావాల‌నే కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఓట‌ర్ల‌ను పెద్ద ఎత్తున లేకుండా చేసిందంటూ ఆరోపించారు. ఇందులో అధికారులు కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించారంటూ ధ్వ‌జమెత్తారు. త‌మ పేర్లు ఓట‌ర్ల జాబితా వ‌ద్ద లేవంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం మ‌నీస్ సిసోడియా.

ప్ర‌తి ఒక్క‌రు త‌మ విలువైన ఓటును వినియోగించు కోవాల‌ని పిలుపునిచ్చారు మ‌నీష్ సిసోడియా. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే విధంగా కేంద్రం య‌త్నిస్తోందంటూ ఆరోపించారు.

Also Read : సంస్థాగ‌త జ‌వాబుదారీత‌నం అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!