By Polls Counting : ఉప ఎన్నికల్లో బీజేపీ..ఆర్జేడీ లీడ్
ఉత్కంఠ రేపుతున్న బై పోల్స్
By Polls Counting : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక తెలంగాణలోన మునుగోడులో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. మొదటి, నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తే రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్ లోకి వచ్చింది.
బీహార్ , మహారాష్ట్రలలో సమీకరణాలు మారిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది(By Polls Counting).
బీహార్ , తెలంగాణ, హర్యానాలలో నువ్వా నేనా అన్న రీతిలో కౌంటింగ్ కొనసాగుతోంది. యూపీలోని గోకరానాథ్, హర్యానా లోని అడంపూర్ , బీహార్ లోని గోపాల్ గంజ్ , ఒడిశా లోని ధామ్ నగర్ లో బీజేపీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక బీహార్ లోని మొకామాలో తేజస్వి యాదవ్ లోని ఆర్జేడీ ముందంజలో ఉంది.
మునుగోడులో బీజేపీ లీడ్ లో ఉంది. ఇక ముంబై లోని అంధేరి ఈస్ట్ సీటులో ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ అభ్యర్థి విజయం వైపు సాగి పోతున్నారు. ఏడు స్థానాల్లో బీజేపీ మూడు చోట్ల, కాంగ్రెస్ రెండు చోట్ల, శివసేన, ఆర్జేడీలకు ఒక్కొక్కటి చొప్పున లీడ్ లో ఉన్నాయి.
ప్రధానంగా ఈ బైపోల్స్ ను ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటిని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీస్ గా భావిస్తున్నాయి.
Also Read : రౌండ్ రౌండ్ కు నువ్వా నేనా