CM KCR Nitish Kumar : దేశం నుంచి బీజేపీని తరిమి కొట్టాలి
ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపు
CM KCR Nitish Kumar : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై. ఈ దేశాన్ని జలగల్లా బీజేపీ పీడిస్తోందంటూ ఆరోపించారు.
కేసీఆర్ బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ అధినేత , సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. చాలా సేపు సమావేశంలో దేశ రాజకీయాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చలు జరిపారు.
అనంతరం ఇద్దరు సీఎంలు నితీశ్ కుమార్, కేసీఆర్ మీడియాతో(CM KCR Nitish Kumar) మాట్లాడారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇక నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దద్దరిల్లి పోవాలన్నారు కేసీఆర్. తన లక్ష్యం ఒక్కటే..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవడం. మిగతా పార్టీలకు కూడా పోటీ చేసే, స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వాతావరణం ఉండాలని అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఏక వ్యక్తి పాలన సాగుతోందన్నారు. రాచరిక పాలనకు ఫక్తు వకల్తా బీజేపీ పుచ్చుకుందని ధ్వజమెత్తారు సీఎం. ఈ సందర్భంగా బీజేపీ చేసిన మోసాన్ని ముందే గ్రహించి సీఎం నితీశ్ కుమార్ బయట పడ్డాడని అభినందించారు.
ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని, కానీ వాటిని సద్వినియోగం చేసుకునే తెలివి, సోయి మోదీకి, ఆయన పరివారానికి లేదని ఆరోపించారు.
ప్రస్తుతం ఈ దేశానికి కావాల్సింది బీజేపీ రహిత భారత దేశం అని కుండ బద్దలు కొట్టారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందించారు సీఎం నితీశ్ కుమార్. ఇందులో వాస్తవం ఉందన్నారు.
Also Read : సోనియా తల్లి మృతి బాధాకరం – మోదీ