JP Nadda : తొమ్మిది రాష్ట్రాల‌లో జెండా ఎగ‌రాలి

పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

JP Nadda : దేశంలో తొమ్మిది రాష్ట్రాల‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండా ఎగ‌రాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రోడ్ షోను చేప‌ట్టారు. భారీ ఎత్తున పీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు సెమీ ఫైన‌ల్ గా భావించాల‌ని పిలుపునిచ్చారు బీజేపీ జాతీఈయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా(JP Nadda).

ఇవాళ జాతీయ కార్వ‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. పీఎం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బాధ్యులు, బీజేపీ రాష్‌ట్రాల సీఎంలు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జేపీ న‌డ్డా మాట్లాడారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోనే దేశం అభ‌వృద్ది చెందుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే భార‌త్ కు ఎన‌లేని కీర్తి వ‌స్తోంద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

అంతే కాకుండా జీ20 శిఖ‌రాగ్ర గ్రూప్ న‌కు బార‌త్ నాయ‌క‌త్వం వ‌హించ‌డం మోదీ సామ‌ర్థ్యానికి, పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. మోడీ హ‌యాంలోనే ప్ర‌పంచంలోనే మ‌న దేశం ఐదో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించింద‌ని అన్నారు జేపీ న‌డ్డా. సెల్ ఫోన్ల త‌యారీలో భార‌త్ రెండవ స్థానంలో కొన‌సాగుతండ‌గా ఆటోమొబైల్ రంగంలో మూడో అతి పెద్ద త‌యారీదారుగా ఉంద‌ని చెప్పారు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా(JP Nadda).

గుజ‌రాత్ లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింద‌ని పేర్కొన్నారు. 150కి పైగా సీట్లు గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. ఇవే రిజ‌ల్ట్స్ 9 రాష్ట్రాల‌లో పున‌రావృతం కావాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : హామీల‌ను నెర‌వేర్చాం అధికారంలోకి వ‌స్తాం

Leave A Reply

Your Email Id will not be published!