Rashtrapatni Row : కామెంట్స్ కలకలం బీజేపీ ఆగ్రహం
సోనియా..అధిర్ పై స్మృతీ..నిర్మలా ఫైర్
Rashtrapatni Row : కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్ని(Rashtrapatni Row) అని పిలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. చివరకు ఉభయ సభలు తీవ్ర గందరగోళానికి తీశాయి.
లోక్ సభ కొంత సేపు ఉద్రిక్తతల మధ్య వాయిదా పడింది. తిరిగి ప్రారంభమ్యాక కూడా మరోసారి కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోనియా గాంధీ సైతం దురుసుగా మాట్లాడారంటూ స్మృతీ ఇరానీ ఆరోపించింది.
బేషరతుగా పార్టీ తరపున సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారని ఇంకేం చెబుతారంటూ ప్రశ్నించారు సోనియా గాంధీ. సభా సాక్షిగా స్మృతీ ఇరానీ జోక్యం చేసుకున్నారు.
వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు. ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు బీజేపీ ఎంపీలు. నిర్మలా సీతారామన్ సారథ్యంలో పార్లమెంట్ బయట బీజేపీ మహిళా ఎంపీలు పెద్ద పెట్టున షేమ్ షేమ్ అంటూ మండిపడ్డారు.
సోనియా గాంధీ ద్రౌపది ముర్ము అవమానాన్ని మీరు ఆమోదించారు. అత్యున్నత భారత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళలను అవమానించడాన్ని ఒక రకంగా ఓకే చెప్పారంటూ స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశాక నినాదాలు చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్న సోనియా అక్కడి నుంచి వెళ్లి పోయారు. టీఎంసీ ఎంపీలు, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే బీజేపీ సభ్యుల అరుపుల నుంచి సోనియా గాంధీని దూరంగా లాగారు.
నిర్మలా సీతారామన్ సోనియాపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అమర్యాదకరంగా ప్రవర్తించారు. స్పీకర్ ఆమెను సమర్థిస్తారా అంటూ జై రాం రమేష్ అన్నారు.
Also Read : కర్ణాటకలో ఎవరికీ రక్షణ లేదు – డీకే