#BandiSanjay : జనగామ సంఘటన పై బండి సంజయ్ సీరియస్
24 గంటలు టైం ఇస్తున్నా బండి వార్నింగ్
Bandi Sanjay : జనగామలో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని, ఆ సంఘటనపై వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేవలం అయిదుగురు బీజేపీ కార్యకర్తలు మాత్రమే నిరసన తెలిపారని, వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగాయో చెప్పాలన్నారు. గాయపడిన వారిని బండి సంజయ్ పరామర్శించారు. కార్యకర్తలను సీఐ, ఎస్ఐలు ఇద్దరూ దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వాస ఆడడం లేదని మొత్తుకున్నా వినిపించుకోలేదని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో కొంత మంది ఐపీఎస్ అధికారులు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లుగా ఫాం హౌజ్‌లో పండుకుని బయటకు రాని సీఎం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ ఏశారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఈ అమానుష దాడిని చూసి చలించి పోతున్నారని, ఈ ఘటనపై ఖండిస్తున్నారని కానీ మానవత్వం మరిచి పోయి, సోయి తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చలించడం లేదన్నారు.
రాష్ట్రంలో స్వామి వివేకానంద వేడుకలు చేసుకోకూడదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. జనగామ సంఘటనపై సీఎం 24 గంటల లోపు స్పందించాలని లేకుంటే తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. లేక పోతే నీ గడీలు బద్దలు కొడతామంటూ హెచ్చరించారు. నీ ఇంటలిజెన్స్ వ్యవస్థ తమను కని పెట్టలేదన్నారు.
No comment allowed please