Pragya Thakur : ప్రగ్యాపై కాంగ్రెస్ ఫైర్ బీజేపీ సెటైర్
ఆమె చేసిన కామెంట్స్ కరెక్టేనన్న బీజేపీ
Pragya Thakur : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రగ్యా సింగ్ ఠాకూర్(Pragya Thakur) సంచలన వ్యాఖ్యలు చేసింది. లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళలను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమె దేశంలోని హిందూ కుటుంబాలు కత్తులను సిద్దంగా ఉంచు కోవాలని పిలుపునిచ్చారు.
ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదని, కనుక ప్రతి ఒక్కరు ఆయుధాలను ధరించాలని అన్నారు. ఇది కేవలం ఆత్మ రక్షణ కోసం మాత్రమేనని పేర్కొన్నారు ప్రగ్యా సింగ్ ఠాకూర్. ఆమె చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.
ఇప్పటికే లవ్ జిహాద్ పేరుతో ముస్లింలకు చెందిన వారు హిందువులకు చెందిన అమ్మాయిలను , మహిళలను వలలో వేసు కోవడం, డేటింగ్ పేరుతో దారుణంగా హత్య చేయడం, ఆపై సూసైడ్ కు పురి కొల్పేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. వెంటనే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్(Pragya Thakur) పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. ఆత్మ రక్షణ కోసం తమ వద్ద ఆయుధాలు ఉంచు కోవాలని లేకుంటే కనీసం నిత్యం వాడే కూరగాయలు కోసే కత్తులను పదును పెట్టు కోవాలని సూచించిందని తెలిపింది.
ఇందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏముందంటూ ప్రశ్నించింది బీజేపీ. రాజకీయం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ కు బీజేపీ సూచించింది.
Also Read : తునీషాను వాడు చంపేశాడు – వనిత