Yennam Srinivas Reddy : యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై వేటు
బీజేపీ నుంచి సస్పెండ్
Yennam Srinivas Reddy : హైదరాబాద్ – ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. ఈ మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ లైన్ ను దాటారంటూ అందుకే యెన్నంపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.
Yennam Srinivas Reddy Issue
ఇదిలా ఉండగా ఇటీవలే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) కలిశారు. ఆయనతో పాటు ఈటెల రాజేందర్ అనుచరుడిగా పేరు పొందిన ఏనుగు రవీందర్ రెడ్డి కూడా జూపల్లిని కలిసిన వారిలో ఉన్నారు.
గత కొంత కాలం నుండి బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. తరచూ పలు వేదికలపై బీజేపీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తూ వచ్చారు. గతంలో తెలంగాణ వాదిగా ముద్ర పడ్డారు. ఆ తర్వాత పలు కీలక పోరాటాలలో ముఖ్య భూమికను పోషించారు. ఆయన కస్టమ్స్ లో ఆఫీసర్ గా పని చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రగతి భవన్ లో ప్రజాస్వామ్యం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అక్కడి నుండి బీజేపీలో చేరారు. తీరా పార్టీ నుండి వేటుకు గురయ్యారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. కాగా బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
Also Read : MLA Rajaiah : నాకే సీటు పక్కా – రాజయ్య