BJP Ticket Row : తెలంగాణ బీజేపీలో టికెట్ల లొల్లి

టికెట్ రాలేద‌ని బోరుమ‌న్న ర‌మాదేవి

BJP Ticket Row : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌లో పోటీ చేసేందుకు గాను పార్టీ త‌ర‌పున 52 మందికి టికెట్ల‌ను కేటాయించింది. ప్ర‌త్యేకించి పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మ‌హిళ‌ల‌కు ప్ర‌యారిటీ ఇచ్చింది.

BJP Ticket Row Viral

ఇందులో భాగంగా మొద‌టి నుంచి పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌కు , టికెట్ ఆశించిన వాళ్ల‌కు మొండి చేయి చూపించ‌డంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా బిజేపీ టికెట్ ఆశించి, భంగ ప‌డింది భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నిర్మ‌ల్ జిల్లా అధ్య‌క్షురాలు ర‌మా దేవి.

త‌ను ముందు నుంచీ టికెట్ వ‌స్తుంద‌ని ఆశించింది. నిర‌ర్మ‌ల్ బీజేపీకి(BJP) షాక్ త‌గిలింది. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన రమా దేవి పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముథోల్ నుంచి ఆమె టికెట్ ఇవ్వాల‌ని ఆమె కోరారు. దీంతో త‌న‌కు ఇవ్వ‌కుండా త‌న‌ను బీజేపీ మోసం చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ద‌శాబ్దానికి పైగా భైంసా, ముధోల్ లో బీజేపీని ప్రాణం పెట్టి కాపాడుకుంటూ వ‌చ్చాన‌ని, త‌న‌ను న‌మ్మించి గొంతు కోశారంటూ ర‌మాదేవి వాపోయారు. కంట త‌డి పెట్టారు. బోరుమంటూ ఏడ్చారు. త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : AP High Court TTD : ఆర్జిత సేవా టికెట్ భ‌క్తుల‌కు షాక్

Leave A Reply

Your Email Id will not be published!