BJP TMC Rallys : పోటా పోటీగా బీజేపీ..టీఎంసీ ర్యాలీలు
నువ్వా నేనా అంటున్న అభిషేక్..సువేందు
BJP TMC Rallys : పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ , ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోటా పోటీగా ర్యాలీలు(BJP TMC Rallys) చేపట్టడం ఉద్రిక్తంగా మారింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో కొంటాయ్ లో ర్యాలీ చేపట్టనున్నారు శనివారం రోజు.
బీజేపీకి చెందిన సువేందు అధికారి డైమంబ్ హార్బర్ లో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అభిషేక్ , అధికారి పరస్పరం హోమ్ టర్న్ ల వద్ద ర్యాలీలు చేపట్టడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే కోల్ కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లా అండ్ ఆర్డర్ కాపాడాలని ఆదేశించింది.
ఇందుకు ఎవరూ కూడా గీత దాట కూడదని, అనుచిత కామెంట్స్ చేయవద్దంటూ స్పష్టం చేసింది. దీంతో బెంగాల్ లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇద్దరూ పోటా పోటీగా నిర్వహించడం కీలకంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు గొడవ పడే ప్రమాదం ఉందని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించి కోల్ కతా హైకోర్టు.
ఇదిలా ఉండగా తాము చేపట్టే ర్యాలీని కావాలని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు బీజేపీ అగ్ర నాయకుడు సువేందు అధికారి. తమను ముట్టుకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుందుడుకు కలిగించే కామెంట్స్ చేయవద్దని సూచించింది. నోరును అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేసింది. శనివారం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా.
Also Read : బీజేపీ ర్యాలీ భగ్నానికి టీఎంసీ కుట్ర