BJP TOP ADR 2022 : గుజరాత్ ఎన్నికల విరాళాల్లో బీజేపీ టాప్
రూ. 163 కోట్లు కాంగ్రెస్ కు రూ. 11 కోట్లు
BJP TOP ADR 2022 : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో ఎన్నికల విరాళాలు అందాయి. ప్రస్తుతం ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసోయేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలు వచ్చాయనే దానిపై రిపోర్టు విడుదల చేసింది.
ఇందులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయట పడ్డాయి. ప్రధానంగా అత్యధికంగా విరాళాలు బీజేపీకి అందాయి. ఏకంగా ఆ పార్టీ రూ. 163 కోట్ల రూపాయలను విరాళాలు పొందింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేవలం రూ. 11 కోట్లు మాత్రమే అందుకుంది. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది.
ఈ సందర్భంగా ఏడీఆర్ తన నివేదికను వెల్లడించడం కలకలం రేపింది. గుజరాత్ మొత్తం వాటాలో 94 శాతం బీజేపీకి దక్కడం విశేషం. కాంగ్రెస్ కు కేవలం 5 శాతం మాత్రమే విరాళాలు అందాయి. ఏడీఆర్(BJP TOP ADR 2022) నివేదిక వెల్లడించిన వెంటనే ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి.
మార్చి 2018 నుండి అక్టోబర్ 2022 వరకు అన్ని పార్టీలు కలిసి గుజరాత్ లో రూ. 174 కోట్ల విరాళాలు అందుకున్నాయి. ఇందులో బీజేపీకి రూ. 163 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 10.5 కోట్లు , ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 32 లక్షలు రాగా ఇతర పార్టీలు అన్నీ కలిపి రూ. 20 లక్షలు వచ్చాయి.
ఇక జాతీయ స్థాయిలో 2017-18 నుండి కొనుగోలు చేసిన మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 65 శాతం బీజేపీకే వెళ్లడం గమనార్హం. గుజరాత్ కు చెందిన ప్రూడంట్ ఎలక్టోరల్ సంస్థ ఏకంగా రూ. 74 కోట్లు ఇవ్వడం విశేషం.
Also Read : గెలిపించండి ‘నేతాజీ’ పేరు నిలబెట్టండి