Adampur By Poll Win : ఆదంపూర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ విక్ట‌రీ

భ‌జ‌న్ లాల్ మ‌నుమ‌డు బిష్ణోయ్ గెలుపు

Adampur By Poll Win : దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఉప ఎన్నిక‌ల్లో హ‌ర్యానా లోని ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన అభ్య‌ర్థి భ‌వ్య బిష్ణోయ్ ఘ‌న విజ‌యాన్ని సాధించారు. మాజీ సీఎం భ‌జ‌న్ లాల్ మ‌నుమ‌డు. హ‌ర్యానాలో వ‌రుస‌గా రెండు ఉప ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల ఓట‌మి త‌ర్వాత బీజేపీ ఆడంపూర్ లో విక్ట‌రీ(Adampur By Poll Win) సాధించింది.

1968 నుంచి ఆదంపూర్ సీటును భ‌జ‌న్ లాల్ కుటుంబీకులు కైవ‌సం చేసుకుంటూ వ‌స్తున్నారు. ఆదంపూర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీపై 16,000 ఓట్ల తేడాతో బీజేపీ విజ‌యం సాధించింది. బీజేపీ నాయ‌కుడు కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, రాష్ట్ర మాజీ సీఎం భ‌జ‌న్ లాల్ మ‌న‌వుడే ఈ భ‌వ్య బిష్ణోయ్ .

త‌న కుటుంబ కోట‌ను నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ జై ప్ర‌కాశ్ ను ఓడించారు. 1968 నుండి ఆదంపూర్ సీటును భ‌జ‌న్ లాల్ కుటుంబం ఆధీనంలోకి తీసుకుంది. దివంగ‌త మాజీ సీఎం తొమ్మిది సార్లు గెలుపొందారు. ఇక ఆయ‌న భార్య జ‌స్మా దేవి ఒక‌సారి , కుల్దీప్ బిష్ణోయ్ నాలుగు సార్లు ప్రాతినిధ్యం వ‌హించారు.

2019లో కుల్దీప్ బిష్ణోయ్ 29,000 ఓట్ల‌కు పైగా గెలుపొందారు. ఈసారి భ‌వ్య బిష్ణోయ్ 16,000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఆదంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 76.45 శాతం ఓటింగ్ న‌మోదైంది. త‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుని విజ‌యం క‌ట్ట‌బెట్టినందుకు ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధన్య‌వాదాలు తెలిపారు.

మాజీ సీఎం భూపింద‌ర్ సింగ్ హూడా మాత్రం ఆదంపూర్ త‌మ పార్టీకి కంచుకోట‌గా పేర్కొన్నారు.

Also Read : అంధేరిలో ఉద్ద‌వ్ అభ్య‌ర్థి ల‌ట్కే లీడ్

Leave A Reply

Your Email Id will not be published!