BJP Worker Murder : కర్ణాటక సర్కార్ పై మిన్నంటిన ఆగ్రహం
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్
BJP Worker Murder : కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని చవి చూస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన యువజన విభాగం కార్యకర్త ప్రవీణ్ నెట్టారు దారుణ(BJP Worker Murder) హత్యకు గురయ్యాడు. అతడి హత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
బుధవారం విశ్వ హిందూ పరిషత్ బంద్ కి పిలుపునిచ్చింది. తన దుకాణం మూసుకుని తిరిగి బైక్ పై ఇంటికి వస్తుండగా దారి కాచిన ముగ్గురు దుండకులు వెంట పడి దారుణంగా నరికి హత్య చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పార్టీకి సంబంధించిన కార్యకర్తల ప్రాణాలను కాపాడడంలో వైఫల్యం చెందిందంటూ ఆరోపించారు.
కర్ణాటక లోని పలు ప్రాంతాలలో బీజేపీ యువజన విభాగం సభ్యులు సామూహిక రాజీనామాలు చేశారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నళనికుమార్ కటీల్ కారును ఆందోళనకారులు చుట్టు ముట్టారు.
ఆయనపై దాడి చేసినంత పని చేశారు. ప్రస్తుతం పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదిలా ఉండగా బీజేవైఎం సభ్యుడిగా ఉన్నారు ప్రవీణ్ నెట్టారు.
తన పౌల్ట్రీ షాప్ ను మూసి వేసి బైక్ పై వస్తుండగా మోటార్ సైకిల్ పై వచ్చిన హంతకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 32 ఏళ్ల వయస్సు కలిగిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చని పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
హంతకుల ఆచూకి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ వెల్లడించారు. నెట్టారు హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందని మితవాద సంస్థలు ఆరోపించాయి.
Also Read : క్యాసినో వ్యవహారం ఈడీ దాడుల కలకలం