Mahua Moitra : బీజేపీ కామెంట్స్ ‘మహూవా’ సీరియస్
తందూరి చికెన్ పై సిల్లీ కామెంట్స్
Mahua Moitra : లోక్ సభ, రాజ్యసభకు చెందిన 27 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 50 గంటల నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో వీరంతా కొలువు తీరారు. అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు.
టెంట్లు వేసుకోనీయలేదు. ఇందుకు అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఎంపీలకు తందూరి కోడి వడ్డించారంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు షెహజాద్ పూనావాలా కామెంట్స్ చేశారు.
పూనావాలాపై నిప్పులు చెరిగాడు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra) . ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. తాము బయట తింటే బీజేపీ నాయకులు, శ్రేణులు తలుపులు మూసుకుని తింటారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
సిల్లీ థింగ్స్ అంటూ కొట్టి పారేశారు. తాము ఏం తింటున్నామనేది వారికి ఎందుకు అని ప్రశ్నించారు ఎంపీ. వివిధ పార్టీలు తమకు చెందిన ఎంపీల ఆహారాన్ని జాగ్రత్తగా ఇస్తున్నాయి.
ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీలలో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఆప్ ఎంపీలు ఉన్నారు. అల్పహారం, భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఈ ఎంపీలలో వివిధ రోగాలు ఉన్న వారు ఉన్నారని సమాచారం. వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే జూలై 28న టీఎంసీ పార్టీ తమ ఎంపీలకు తందూరీ చికెన్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపిన ఎంపీలు చికెన్ ఎలా తింటారంటూ బీజేపీ ప్రతినిధి పూనావాలా ప్రశ్నించారు. టీఎంసీ ఎంపీ సుస్మితాదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. తమను చూసి అభద్రతా భావానికి లోనవుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : భారత దేశానికి అధీర్ క్షమాపణ చెప్పాలి