Jairam Ramesh : కన్నడ నాట బీజేపీ పతనం ఖాయం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం
Jairam Ramesh : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుకుంది. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని వర్గాలకు చెందిన వారంతా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 30న చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట మీదుగా అడుగు పెట్టింది. ప్రస్తుతం సోనియా గాంధీ మాండ్యా జిల్లాలో కొనసాగుతున్న యాత్రలో చేరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్ స్పందించారు.
కర్ణాటకలో అక్రమంగా కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ పై పోయిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసు కుంటున్నారని అద్బుతంగా ఆదరణ లభిస్తోందని తెలిపారు జై రాం రమేష్(Jairam Ramesh).
పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న యాత్రలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.
కర్ణాటక నుంచి జై రాం రమేష్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు కర్ణాటక కేరాఫ్ గా మారిందన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ ఏదైనా ఉందంటే అది కర్ణాటక తప్ప ఇంకేదీ లేదన్నారు జైరాం రమేష్.
అంతకు ముందు సోనియా గాంధీ బేగూర్ గ్రామం లోని భీమనకొల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
Also Read : రాహుల్ గాంధీ అభ్యర్థన బొమ్మై స్పందన