BJP New Rules : పార్టీ నేతలకు బీజేపీ లక్ష్మణ రేఖ
వివాదాస్పద అంశాలు మాట్లాడొద్దు
BJP New Rules : భారతీయ జనతా పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ నేతలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహ్మద్ ప్రవక్త పై ఇదే పార్టీకి చెందిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇస్లామిక్, అరబ్ దేశాలు ఏకంగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశాయి. పోయిన పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.
తాజాగా ఎవరైనా సరే పార్టీ నుంచి మాట్లాడే నేతలు సంయమనం పాటించాలని సూచించింది. అంతే కాదు నోరు పారేసు కోవద్దంటూ కోరింది. ఎవరైనా నోరు జారినా లేదా గీత దాటితే వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
బీజేపీ(BJP New Rules) ఈమేరకు మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపిక చేసిన స్పోక్స్ పర్సన్స్ , ప్యానలిస్టులు మాత్రమే టీవీ చర్చల్లో పాల్గొంటారని, మీడియా సెల్ వారికి కేటాయించ బడుతుందని స్పష్టం చేసింది బీజేపీ హై కమాండ్.
వివాదాస్పద అంశాల జోలికి వెళ్లవద్దని, కేందం కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, మంజూరు చేసిన నిధులు, జరిగిన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేసింది.
అంతే కాకుండా పార్టీకి సంబంధించిన విధి విధానాలను , సిద్దాంతాలను గురించి మాత్రమే ప్రస్తావించాలని సూచించింది. ఇదే సమయంలో ఎవరు రెచ్చగొట్టినా రెచ్చి పోవద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇక నుంచి లక్ష్మణ రేఖ ఒకటి ఉందని గుర్తుంచు కోవాలని పేర్కొంది. ఏ మతాన్ని, దాని చిహ్నాలను లేదా మత పరమైన వ్యక్తులను విమర్శించ వద్దని కుండ బద్దలు కొట్టింది. చర్చల్లో పాల్గొనే కంటే ముందు సరి చూసు కోవాలని సూచించింది.
Also Read : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం