Twitter Blue Tick : 29 నుంచి బ్లూ టిక్ స‌బ్ స్క్రిప్ష‌న్ – మ‌స్క్

ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్

Twitter Blue Tick : ట్విట్ట‌ర్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ రోజుకో ప్ర‌క‌ట‌న‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే 4 వేల మందిని సాగ‌నంపాడు. ఆపై కాంట్రాక్టు ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న 5 వేల మందిని తొల‌గించాడు. మ‌నోడు వ‌చ్చాక ఎంప్లాయిస్ లో వ‌ణుకు మొద‌లైంది. తాను పెట్టిన ఖ‌ర్చు రూ. 4,400 కోట్ల‌ను ఎలా తిరిగి రాబ‌ట్టు కోవాల‌నే దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. ఇప్ప‌టికే అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చు లేకుండా చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాడు.

ఇదే స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో లో ట్విట్ట‌ర్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. ఇందులో ఒక్క ఏడాదికి కేవ‌లం ఫుడ్ కోసం $13 మిలియ‌న్లు ఖ‌ర్చు అవుతోంద‌ని దీనికి లెక్కా ప‌త్రం లేకుండా పోయిందంటూ మండిప‌డ్డారు.

ఈ మేర‌కు ఉద్యోగులంద‌రికీ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అదేమిటంటే ఇక నుంచి భోజ‌నం, ఇత‌ర సౌక‌ర్యాలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ మేర‌కు ఇమెయిల్స్ ద్వారా స‌మాచారం ఇచ్చారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు ఎలాన్ మ‌స్క్. అదేమిటంటే ట్విట్ట‌ర్ లో కోట్లాది మంది స‌భ్యులుగా ఉన్నా ల‌క్ష‌ల్లో బ్లూ టిక్ మార్క్ క‌లిగి ఉన్నారు. వారంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఇక నుంచి నెల‌కు $8 డాల‌ర్లు అంటే భార‌తీయ రూపాయ‌ల్లో 749 రూపాయ‌లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశించాడు.

మ‌రిన్ని అద‌న‌పు ఫీచ‌ర్లతో పాటు సెక్యూరిటీ కూడా క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. కాగా ఎలాన్ మ‌స్క్ ఫేక్ అకౌంట్ల గురించి వాటిని తీసి వేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ట్విట్ట‌ర్ బ్లూ టిక్(Twitter Blue Tick) స‌బ్ స్క్రిప్ష‌న్ న‌వంబ‌ర్ 29 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించాడు.

Also Read : ట్విట్ట‌ర్ ఆల‌స్యం త్వ‌ర‌లోనే ప‌రిష్కారం – మ‌స్క్

Leave A Reply

Your Email Id will not be published!