Bodiga Shobha : ర‌ద్దు చేస్త‌డు ఎన్నిక‌ల‌కు పోత‌డు

మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కామెంట్స్

Bodiga Shobha : బ‌రా బ‌ర్ అసెంబ్లీని ర‌ద్దు చేస్తడు కేసీఆర్. ఎన్నిక‌ల‌కు పోత‌డు. ఆయ‌న కాద‌న్న‌డు అంటే త‌ప్ప‌కుండ చేస్త‌డ‌ని అర్థం. ఇప్ప‌టికే దోచుకున్న‌డు. ఆగం ప‌ట్టించిండు. తెలంగాణ‌ను ఆగం ఆగం చేసిండు. ఇంటికో ఉద్యోగం అన్న‌డు. ఇప్పుడు స‌ప్పుడు చేస్త‌లేడు. కొడుకేమో అట్ల బిడ్డ‌నేమో ఇట్ల‌. పోయి పోయి నిన్న మొన్న‌టి దాకా బ‌తుక‌మ్మ అనుకున్న‌రు.

కానీ ఏం చేసింది గీడ కాద‌ని ఢిల్లీకి పోయింది. ఆడ లిక్క‌ర్ స్కాంలో వేలు పెట్టింది. ఇప్పుడు చిలుక ప‌లుకులు ప‌లుకుతోందంటూ నిప్పులు చెరిగింది మాజీ ఎమ్మెల్యే, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌హిళా నాయ‌కురాలు బొడిగె శోభ‌. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్న క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

వీళ్లు పాల‌కులు కాద‌ని రాక్ష‌సులుగా మారారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ ఫ్యామిలీని ఓడిస్తేనే తెలంగాణ‌కు విముక్తి ల‌భిస్తుంద‌ని అన్నారు. లేక పోతే క‌ష్టాలు త‌ప్ప‌వని హెచ్చ‌రించారు బొడిగె శోభ‌. ముందు క‌ల్వ‌కుంట్ల క‌విత‌క్క‌ను బొక్క‌ల వేస్తే సారు క‌థేందో తేలుతుంద‌న్నారు. ఏం చేస్తే ఇంత సంపాద‌న వ‌చ్చిందో జ‌నానికి చెప్పాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే.

పాల‌న ప‌డ‌కేసింద‌ని, అది ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంద‌ని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అన్నోడు నోటిఫికేష‌న్లు ఏసుడు త‌ప్ప ఒక్క‌ట‌న్నా పోస్టు ఇచ్చిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు బొడిగె శోభ‌(Bodiga Shobha).

మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు పెరిగి పోయాయ‌ని, మ‌ద్యం, డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిగా దొరుకుతోంద‌ని దీనిపై పోరాడాల‌ని పిలుపునిచ్చారు బొడిగె శోభ‌.

Also Read : బీఆర్ఎస్ అంతా బ‌క్వాస్ – జ‌గ్గారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!