Anil Deshmukh : అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ మంజూరు
మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్
Anil Deshmukh : మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) కు భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. గతంలో కోర్టును ఆశ్రయించినా దేశ్ ముఖ్ కు బెయిల్ లభించలేదు.
పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు చేశారు మాజీ హోం శాఖ మంత్రిపై. మంగళవారం దేశ్ ముఖ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది బాంబే హైకోర్టు.
ఈ మేరకు కండీషన్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) గత ఏడాది నవంబర్ లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతడి బెయిల్ దరఖాస్తును ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ కు బాంబే హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
రూ. 1 లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ ఆర్డర్ పై రెండు వారాల పాటు స్టే విధించాలని ఈడీ కోరింది. గత ఏడాది నవంబర్ లో దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో బెయల్ దరఖాస్తును ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టు తలుపు తట్టారు. ఈడీ కేసులో దేశ్ ముఖ్ కు బెయిల్ లభించినప్పటికీ గత ఏడాది ఏప్రిల్ లో అతడిపై నమోదైన సీబీఐ కేసుకు సంబంధించి ఇంకా కస్టడీలోనే ఉన్నారు.
Also Read : కేజ్రీవాల్ డుమ్మా ఎల్జీ సక్సేనా గుస్సా