Rahul Gandhi Urges : రాహుల్ గాంధీ అభ్య‌ర్థ‌న బొమ్మై స్పంద‌న

గాయ‌ప‌డిన ఏనుగు పిల్ల‌కు వైద్యం అందిస్తాం

Rahul Gandhi Urges : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర గురువారం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతోంది. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఈ యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi Urges) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాన‌వ‌తా దృక్ఫ‌థంతో గాయ‌ప‌డిన ఏనుగు పిల్ల‌కు వైద్యం సాయం అందించాల‌ని కోరారు.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా విన్న‌వించారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క సీఎం బొమ్మైకి లేఖ రాశారు . దీనిపై ఇవాళ స్పందించారు. నాగ‌ర్ హోల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో ఏనుగు పిల్ల‌కు గాయం కావ‌డాన్ని గుర్తించారు రాహుల్ గాంధీ. ఆయ‌న యాత్ర చేప‌ట్టిన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

రాహుల్ రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ కావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపై స్పందించారు సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై. మాన‌వ‌తావాద ప్ర‌తిపాదిక‌న రాహుల్ చేసిన అభ్య‌ర్థ‌నను తాను ప‌రిశీలించాన‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్(Rahul Gandhi) రాసిన లేఖ త‌న‌కు అందింద‌ని తెలిపారు. అట‌వీ శాఖ అధికారుల‌తో మాట్లాడి గాయ‌ప‌డిన ఏనుగు పిల్ల‌కు వైద్యం అందేలా చూస్తామ‌ని చెప్పారు సీఎం.

ఇవాళ ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సీఎం. నేను ఇప్పుడే బెంగ‌ళూరుకు వ‌చ్చాను. దానికి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలుసుకుంటా. సీనియ‌ర్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ల‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఏనుగు పిల్ల‌కు చికిత్స అంద‌జేసేలా చూస్తామ‌న్నారు బొమ్మై. మైసూరు నుంచి తిరిగి వ‌చ్చిన వెంట‌నే సీఎం బెంగ‌ళూరులో మీడియాతో మాట్లాడారు.

Also Read : రొటీన్ వ‌ర్క్ లో అశోక్ గెహ్లాట్ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!