Katrina Kaif : విక్కీతో బంధం అద్భుతం

వెల్ల‌డించిన క‌త్రినా కైఫ్

Katrina Kaif : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. తాను విక్కీ కౌశ‌ల్ ఒక్క‌టై నెల రోజుల‌వుతోందా అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. ఇవాళ త‌న సంతోషాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

మా అంద‌మైన అనుబంధానికి ఈ ఫోటో ఓ గుర్తుగా ఉండి పోతుంది అంటూ పేర్కొంది. దీనికి నేహా ధూపియా సైతం స్పందించింది. మీ జంట‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది అంత‌కంటే ఆనందంగా ఉందంటూ తెలిపింది.

ఇక న‌టి వాణి క‌పూర్ అయితే సో బ్యూటిఫుల్ అండ్ సో నైస్ అని కితాబు ఇచ్చింది. క‌త్రినా కైఫ్(Katrina Kaif), విక్కీ కౌశ‌ల్ ఇద్ద‌రూ గ‌త ఏడాది 2021 డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాధోపూర్ లో వివాహం చేసుకున్నారు.

వీరిద్ద‌రూ పెళ్లి అయ్యాక ముంబై లోని కొత్త ఇంట్లో ఉంటున్నారు. ఈ జంట‌తో పాటు ఒకే భ‌వ‌నంలో ఉంటున్న క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, న‌టి అనుష్క శ‌ర్మ‌ల‌కు పొరుగునే ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా అనుష్క శ‌ర్మ కూడా కామెంట్ చేసింది. అంద‌మైన వ్య‌క్తులైన మీ ఇద్ద‌రికీ అభినంద‌న‌లు. జీవితాంతం క‌లిసి మెలిసి , ప్రేమ‌తో అవ‌గాహ‌న‌తో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది.

ఆనందంగా మీ జంట‌ను మా ఇంటికి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్నామంటూ తెలిపింది. ఇదిలా ఉండ‌గా క‌త్రినా కైఫ్ (Katrina Kaif)త‌దుప‌రి మూవీ టైగ‌ర్ 3లో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి నటించ‌నుంది.

ఆమె చివ‌రి సారిగా రోహిత్ శెట్టి సూర్య‌వంశీలో అక్ష‌య్ కుమార్ తో క‌నిపించింది.

Also Read : డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!