Bonthu Rammohan : బీఆర్ఎస్ వీడ‌ను ఏ పార్టీలో చేర‌ను

మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్

Bonthu Rammohan : హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ బొంతు రామ్ మోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న చివ‌రి వ‌ర‌కు టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆశించిన మేర త‌న పేరు లేకుండా పోయింది. దీంతో నిరాశ‌కు గుర‌య్యారు. అయితే పార్టీని మారుతారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

Bonthu Rammohan Praises KCR and KTR

దీనిపై తీవ్రంగా స్పందించారు బొంతు రామ్మోహ‌న్(Bonthu Rammohan). తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీలో చేర‌న‌ని అన్నారు. ఉద్య‌మ కాలం నుండి గ‌త 21 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం ఒక సైనికుడిగా ప‌ని చేశాన‌ని చెప్పారు.

అంచెలంచెలుగా త‌న‌ను ఎదిగేలా చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు. త‌న‌ను మేయ‌ర్ ను చేశార‌ని ఇంత‌కంటే ఏం కావాల‌న్నారు బొంతు రామ్మోహ‌న్. ప‌ద‌వుల కోసం పార్టీలు మార్చే సంస్కృతి త‌న‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు.

కొంద‌రు కావాల‌ని త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని వాపోయారు. న‌న్ను ఇంతటి స్థాయికి తీసుకు వ‌చ్చిన కేసీఆర్ కు, రామ‌న్న‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు . మ‌ళ్లీ బీఆర్ఎస్ లోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు బొంతు రామ్మోహ‌న్.

Also Read : PM Modi : ద‌క్షిణాఫ్రికాతో బ‌ల‌మైన బంధం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!