#FamousBooks : ప్ర‌పంచాన్ని ప్రభావితం చేసే అరుదైన‌ పుస్త‌కాలు ఇవే

పుస్త‌కాలు జీవితాన్ని ప్ర‌భావితం చేస్తాయి. జీవితం ప‌ట్ల‌, స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఎరుక క‌లిగి వుండేలా ..మ‌నుషులు చెడిపోకుండా ఉండేలా చేస్తాయి. భోజ‌నం చేయ‌కుండా , దుస్తులు లేకుండా ఉండ‌గ‌ల‌ను కానీ పుస్త‌కాలు చ‌ద‌వ‌కుండా నేనుండ‌లేనంటాడు ఓ సంద‌ర్భంలో ర‌ష్య‌న్ మ‌హా ర‌చ‌యిత మాగ్జిం గోర్కీ.

పుస్త‌కాలు జీవితాన్ని ప్ర‌భావితం చేస్తాయి. జీవితం ప‌ట్ల‌, స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఎరుక క‌లిగి వుండేలా ..మ‌నుషులు చెడిపోకుండా ఉండేలా చేస్తాయి. భోజ‌నం చేయ‌కుండా , దుస్తులు లేకుండా ఉండ‌గ‌ల‌ను కానీ పుస్త‌కాలు చ‌ద‌వ‌కుండా నేనుండ‌లేనంటాడు ఓ సంద‌ర్భంలో ర‌ష్య‌న్ మ‌హా ర‌చ‌యిత మాగ్జిం గోర్కీ. తాజాగా బుక్ వ‌ర‌ల్డ్ కు సంపాద‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్టెఫ‌నీ మెర్రీ వ‌య‌స్సుల వారీగా అత్యుత్త‌మ‌మైన ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన గొప్ప‌నైన పుస్త‌కాల జాబితాను ప్ర‌క‌టించారు

. పుస్త‌క ప్రియుల కోసం , చ‌దువ‌రుల కోసం ఆ పుస్త‌కాలేమిటో తెలుసుకుందాం. మొద‌టి ఏడాదిలో ఎరిక్ కార్లే రాసిన ద వెరీ హంగ్రీ క్యాట‌ర్ పిల్ల‌ర్ పుస్త‌కం మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించింది. రెండు నుంచి 100 దాకా చూస్తే , అన్నా డేవ్డిన్నీ రాసిన లామా లామా రెడ్ ప‌జామా రెండో స్థానాన్ని చేజిక్కించుకుంది. మౌరైజ్ సెండాక్ రాసిన వేర్ ద వైల్డ్ థింగ్స్ ఆర్ పుస్త‌కం మూడో స్థానం పొందింది.

ఇక నాల్గో స్థానంలో క్రిష్ ర‌చ్‌కా రాసిన చార్లీ పార్క‌ర్ ప్లేయ్డ్ బి బాప్ పుస్త‌కం, ఐదో స్థానంలో షెల్ సిల్వ‌ర్‌స్టెన్ రాసిన ద గివింగ్ ట్రీ, ఆరో స్థానంలో బెవ‌ర్లీ క్లారీ రాసిన ర‌మోనా ద పెస్ట్, ఏడో స్థానంలో బిల్ వాట‌ర్స‌న్ ద కంప్లీట్ కాల్విన్ అండ్ హోబ్స్, ఎనిమిదో స్థానంలో జెకె రోలింగ్ రాసిన హ్యారీ పోట‌ర్ అండ్ ద సార్క‌రర్స్ స్టోన్ , తొమ్మిదో స్థానంలో జూడీ బ్లూమ్ రాసిన టేల్స్ ఆఫ్ ఏ ఫోర్త్ గ్రేడ్ న‌థింగ్, 10వ స్థానంలో రైనా టెల్జీమియ‌ర్ రాసిన స్మైల్, 11వ ప్లేస్‌లో జేస‌న్ రెనాడ్స్ రాసిన ఘోస్ట్ పుస్త‌కం పాపుల‌ర్‌గా నిలిచింది. 12వ స్థానంలో టేల‌ర్ రాసిన రోల్ ఆఫ్ థండ‌ర్, హియ‌ర్ మై క్రై పుస్త‌కం, 13వ ప్లేస్‌లో మ‌లాలా యూసుఫ్ జైది రాసిన ఐ-యామ్ మ‌లాలా రాసిన పుస్త‌కం ఎంద‌రినో ప్ర‌భావితం చేసింది. 14వ స్థానంలో స్టీఫెన్ చ్బోస్కై రాసిన ద పెర్క్స్ ఆఫ్ బీయింగ్ ఏ వాల్ట్ ఫ్ల‌వ‌ర్ నిలిచింది.

యాంజీ థామ‌స్ రాసిన ద హేట్ యు గివ్ బుక్ 15వ ప్లేస్‌లో , బ్రోంట్ రాసిన జానే ఐర్ పుస్త‌కం 16వ స్థానంలో, క్యాంప్‌బెల్ రాసిన ఒన్స్ అప్ ఆన్ ఏ రివ‌ర్ బుక్ 17వ స్థానంలో ,  మూర్ రాసిన ఏ గేట్ అట్ ద స్టెయిర్స్ పుస్త‌కం 18వ స్థానంలో , మార్గ‌రెట్ అట్ వుడ్ రాసిన ద హ్యాండ్ మెయిడ్స్ టేల్ బుక్ 19వ ప్లేస్‌లో, జునాట్ డ‌యాజ్ రాసిన ద బ్రీఫ్ వండ‌ర్స్ లైఫ్ ఆఫ్ ఆస్కార్ వావ్ పుస్త‌కం 20 వ స్థానంలో నిలిచింది.

21వ స్థానంలో హెర్నిస్ట్ హెంగిమ్వే రాసిన ద స‌న్ ఆల్ సో రైజెస్ బుక్ , 22వ ప్లేస్‌లో అలెక్సిస్ డే రాసిన డెమోక్ర‌సీ ఇన్ అమెరికా, 23వ స్థానంలో మాల్కం ఎక్స్ అండ్ ఎలెక్స్ హేలీ రాసిన ద ఆటోబ‌యోగ్ర‌ఫీ ఆఫ్ మాల్కం ఎక్స్ పుస్త‌కం ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేసింది. 24వ ప్లేస్‌లో అయాన్ రాండ్ రాసిన అట్లాస్ ష్ర‌గ్గ్‌డ్ బుక్, 25వ స్థానంలో డి.స్మిత్ రాసిన ఐ క్యాప్చ‌ర్ ద క్యాస్టిల్ పుస్త‌కం, 26వ ప్లేస్‌లో జోగి అడిచీ రాసిన అమెరికానాహ్ బుక్, 27వ స్తానంలో స్టీఫెన్ ఆర్. కోవే ర‌చించిన ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్త‌కం ఎంద‌రినో ప్ర‌భావితం చేసింది.

28వ స్థానంలో ఆడ్రీ లార్డీ రాసిన సిస్ట‌ర్ అవుట్ సైడ‌ర్ ఉండ‌గా, 29వ ప్లేస్‌లో మైఖేల్ పొల్లాన్ రాసిన ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఫుడ్ బుక్, 30వ స్థానంలో అలెక్స్ కంఫ‌ర్ట్ రాసిన ద జాయ్ ఆఫ్ సెక్స్ , 31వ ప్లేస్‌లో జూలియా చైల్డ్, లూయిసెట్టీ, బెక్ రాసిన మాస్ట‌రింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్రెంచ్ కుకింగ్ బుక్ నిలిచింది. 32 వ స్థానంలో జాన్ స్టెయిన్ బెక్ రచించిన ద గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ , 33వ ప్లేస్‌లో పాల్ మొనెట్టే రాసిన బిక‌మింగ్ ఏ మ్యాన్ – ఆఫ్ ఏ లైఫ్ స్టోరీ పుస్త‌కం , 34వ స్థానంలో టోనీ మోరిస‌న్ రాసిన బిల‌వ్ డ్ బుక్, 35వ ప్లేస్ లో ఫేబ‌ర్, మాజ్లిష్ రాసిన హౌ టు టాక్ సో కిడ్స్ విల్ లిజ‌న్ అండ్ లిజ‌న్ సో కిడ్స్ విల్ టాక్ పుస్త‌కం, 36వ స్థానంలో షెర్లీ జాక్స‌న్ రాసిన లైఫ్ అమాంగ్ ద సావేజెస్ పుస్త‌కం నిలిచింది. 37వ స్థానంలో అమీటాన్ రాసిన ద జాయ్ ల‌క్ క్ల‌బ్ బుక్, 38వ ప్లేస్ లో రిచ‌ర్డ్ ఫోర్డ్ రాసిన ద స్పోర్ట్స్ రైట‌ర్, 39వ స్థానంలో లియానే రాసిన వాట్ లైస్ ఫ‌ర్‌గాట్ బుక్, 40వ ప్లేస్‌లో బౌబీ రాసిన ద డైవింగ్ బెల్ అండ్ ద బ‌ట్ట‌ర్  ఫ్లై పుస్త‌కం ఫేవ‌ర‌బుల్‌గా వినుతికెక్కింది.

41వ స్థానంలో జాన్ రాసిన రాబిట్, ర‌న్ పుస్త‌కం నిల‌వ‌గా, 42వ ప్లేస్‌లో క్లారీ రాసిన ద వుమెన్ అప్ స్టెయిర్స్, 43వ స్థానంలో జోరా హ‌ర్స్‌ట‌న్ రాసిన దెయిర్ ఐస్ వియ‌ర్ వాచింగ్ గాడ్ బుక్, 44వ ప్లేస్‌లో టార్ట్ సినిమా రాసిన ద గోల్డ్ ఫించ్ పుస్త‌కం పొందింది. 45వ స్థానంలో మ‌రియా శాంపిల్ రాసిన వేర్ వుడ్ యు గో, బెర్నాడెట్టే పుస్త‌కం, 46వ ప్లేస్‌లో జెస్మిన్ వార్డ్ రాసిన సాల్వేజ్ ద బోన్స్ పుస్త‌కం, 47వ స్థానంలో బాబ్ అండ‌ర్స‌న్ రాసిన స్ట్రెచింగ్ బుక్ ఉండ‌గా, 48వ స్థానంలో టినా ఫే రాసిన బాసీపాంట్స్ పుస్త‌కం, 49వ ప్లేస్‌లో హెన్రీ డేవిడ్ థ‌రో రాసిన వాల్డ‌న్ బుక్, 50వ స్థానంలో జేమ్స్ రాసిన ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే పుస్త‌కం నిలిచింది. 51వ ప్లేస్‌లో అలైస్ మున్రో రాసిన వూ డు యు థింక్ యు ఆర్ బుక్, 52వ స్థానంలో హ‌రుకి ముర‌కామి రాసిన మెన్ వితౌట్ ఉమెన్ పుస్త‌కం, 53వ ప్లేస్ లో ఫ్రెడ‌రిక్ బ్యాక్ మ్యాన్ ర‌చించిన ఏ మ్యాన్ కాల్‌డ్ ఓవ్ బుక్, 54వ స్థానంలో ఎర్నెస్ట్ బెకెర్ రాసిన ద డేనియ‌ల్ ఆఫ్ డెత్ బుక్ స్థానం పొందింది.

55వ ప్లేస్‌లో ఎలిజ‌బెత్ స్ట్రౌట్ ర‌చించిన ఓలివ్ కెటెర్జ్ పుస్త‌కం, 56వ స్థానంలో పేమా చోర్డాన్ రాసిన వెన్ థింగ్స్ ఫాల్ అపార్ట్ బుక్, 57వ ప్లేస్‌లో ఇషిగురో రాసిన రిమైన్స్ ఆఫ్ ద డే పుస్త‌కం, 58వ స్థానంలో ఎర్‌డ్రిచ్ రాసిన ద ప్లాగ్ ఆఫ్ డౌస్ బుక్, 59వ స్థానంలో కాటీ బౌమ్యాన్ రాసిన డైన‌మిక్ ఎగింగ్ బుక్, 60వ స్థానంలో ఎమిలీ గై బిర్కెన్ రాసిన ద ఫైవ్ ఇయ‌ర్స్ బిఫోర్ యు రిటైర్ పుస్త‌కం, 61వ స్థానంలో ఎరికా జాంగ్ రాసిన ఫియ‌ర్ ఆఫ్ డ‌యింగ్ బుక్ నిలిచింది. 62వ ప్లేస్‌లో హెలెన్ సిమ‌న్స‌న్ రాసిన మేజ‌ర్ పెట్టిగ్రీవ్ లాస్ట్ స్టాండ్ బుక్, 63వ స్థానంలో కెంట్ రాసిన అవ‌ర్ సోల్స్ అట్ నైట్ చేజిక్కించుకుంది. 64వ స్థానంలో నెల్ పెయింట‌ర్ రాసిన ఓల్డ్ ఇన్ ఆర్ట్ స్కూల్ పుస్త‌కం, 65వ స్థానంలో మార్క్ ఎవాన్ చిమిస్కీ రాసిన 65 థింగ్స్ టు డు వెన్ యు రిటైర్ బుక్, 66వ స్థానంలో డ‌యానా గ‌బాల్డ‌న్ ర‌చించిన ద అవుట్ లాండ‌ర్ సిరీస్ పుస్త‌కం ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచింది.

ఇక 67వ ప్లేస్‌లో మిగ్యూల్ డే రాసిన డాన్ క్విక్సోట్ పుస్త‌కం ఉండ‌గా 68వ స్థానంలో జాన్ డిడియాన్ రాసిన ద ఇయ‌ర్ ఆఫ్ మ్యాజిక‌ల్ థింకింగ్ బుక్, 69వ స్థానంలో నోరా ఎఫిరాన్ ర‌చించిన ఐ రిమెంబ‌ర్ న‌థింగ్ పుస్త‌కం నిలిచింది. 70వ ప్లేస్‌లో పీట‌ర్ స్పైర్స్ రాసిన మాస్ట‌ర్ క్లాస్, లివింగ్ లాంగ‌ర్, స్ట్రాంగ‌ర్ అండ్ హ్యాపియ‌ర్ బుక్ ఉండ‌గా 71వ స్థానంలో స‌ల్మాన్ ర‌ష్డీ రాసిన మిడ్ నైట్స్ చిల్డ్ర‌న్ పుస్త‌కం, 72వ ప్లేస్‌లో గాబ్రియ‌ల్ గార్సియా మార్క్వెజ్ ర‌చించిన ల‌వ్ ఇన్ ద టైమ్ ఆఫ్ క‌ల‌రా బుక్, 73వ ప్లేస్‌లో రాబ‌ర్ట్ కారో రాసిన ద ఇయ‌ర్స్ ఆఫ్ లిండాన్ జాన్స‌న్ పుస్త‌కం నిల‌వ‌గా 74వ స్థానంలో మార్క్ హెల్పిరిన్ ర‌చించిన ద హిస్ట‌రీ ఆఫ్ ల‌వ్ బుక్ పొందింది. 75వ ప్లేస్‌లో నికోల్ క్రాస్స్ రాసిన ద హిస్ట‌రీ ఆఫ్ ల‌వ్ పుస్త‌కం, 76వ స్థానంలో మారీ పైఫెర్ రాసిన వుమెన్ రోయింగ్ నార్త్ బుక్ ఉండ‌గా , 77వ ప్లేస్‌లో రాబిన్స‌న్ రాసిన గిలీడ్ పుస్త‌కం పాపుల‌ర్‌గా నిలిచింది.

78వ స్థానంలో బి.వైట్ ర‌చించిన చార్లెట్ట్ వెబ్ పుస్త‌కం ఉండ‌గా, 79వ ప్లేస్‌లో సైమ‌న్ డే రాసిన ద క‌మింగ్ ఆఫ్ ఏజ్ బుక్ , 80 వ ప్లేస్‌లో మే సార్ట‌న్ రాసిన క‌మింగ్ ఇన్ టు ఎయిటీ . పోయొమ్స్ పుస్త‌కం నిలిచింది. 81వ ప్లేస్‌లో మేరీ ఓలివ‌ర్ ర‌చించిన డివోష‌న్స్ బుక్ ఉండ‌గా , 83వ స్థానంలో ఆల్ థ్రిల్ల‌ర్స్ అండ్ మిస్ట‌రీస్ పుస్త‌కం, 84వ స్తానంలో ద లాస్ట్ అన్‌నోస్ బుక్, 85వ ప్లేస్‌లో సాల్ బెల్లో ర‌చించిన రావెల్‌స్ట‌న్ పుస్త‌కం నిలిచింది. 86వ స్థానంలో జానే గార్ద‌మ్ రాసిన ఓల్డ్ ఫిఫ్త్ బుక్ ఉండ‌గా, 87వ స్థానంలో విలియం షేక్స్ పియ‌ర్ రాసిన కింగ్ లియ‌ర్ పుస్త‌కం నిలిచింది. 88వ ప్లేస్‌లో నియ‌రింగ్ నైంటీ, అండ్ అద‌ర్ కామెడీస్ ఆఫ్ లేట్ లైఫ్ బుక్, 89వ స్థానంలో డొనాల్డ్ హాల్ ర‌చించిన ఏ కార్నివాల్ లాసెస్, నోట్స్ నియ‌రింగ్ 90 పుస్త‌కం ఎంద‌రినో చ‌దివించేలా చేసింది. జో కూమ‌ర్ రాసిన బీచ్‌కాంబింగ్ ఫ‌ర్ ఏ షిప్ వ్రెక్‌డ్ గాడ్ బుక్, 91వ ప్లేస్‌లో సీమ‌స్ హానే ర‌చించిన సెలెక్టెడ్ పోయెమ్స్ 1988-2013 పుస్త‌కం ఉండ‌గా , 92వ ప్లేస్‌లో జూలియ‌న్ బార్నెస్ రాసిన న‌థింగ్ టు బి ఫ్రైంటెండ్ ఆఫ్ బుక్ పొందింది.

93వ ప్లేస్‌లో యువాల్ హ‌రారీ ర‌చించిన సాపైన్స్ పుస్త‌కం, 94వ స్థానంలో ఆస్థాన్ రాసిన దిస్ ఛైయిర్స్ రాక్స్, ఏ మేనిఫెస్టో అగైనెస్ట్ అగేయిజం బుక్ ఉండ‌గా 95వ ప్లేస్‌లో ఎలెనా రాసిన ద నియాపొలిటాన్ నావ‌ల్స్ పుస్త‌కం నిలిచింది. 96వ స్థానంలో డ‌యానా ఆథిల్ ర‌చించిన స‌మ్ వేర్ టువ‌ర్డ్స్ ద ఎండ్ బుక్ , 97వ స్థానంలో బేవెర్లీ క్లారీ ర‌చించిన మై ఓన్ టు ఫీట్ పుస్త‌కం ఉండ‌గా 98వ స్థానంలో జార్జ్ డాస‌న్ అండ్ రిచ‌ర్స్ గ్లాబ్‌మ్యాన్ రాసిన లైఫ్ ఈజ్ గాడ్ బుక్ ,  99వ ప్లేస్ లో లారెన్స్ రాసిన లిటిల్ బాయ్ పుస్త‌కం, 100వ స్థానంలో హెర్మాన్ వౌక్ ర‌చించిన సెయిల‌ర్ అండ్ ఫిడ్లెర్ , రిఫ్లెక్ష‌న్స్ ఆఫ్ ఏ 100 ఇయ‌ర్ ఓల్డ్ ఆథ‌ర్ బుక్ పొందింది. పుస్త‌క ప్రియులు, అభిమానులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, బుక్ ఫ్యాన్స్ , మేధావులు, స్టూడెంట్స్ ఎక్క‌డైనా ఈ పుస్త‌కాలు దొరికితే కొని చ‌ద‌వండి. ఎందుకంటే కాలం కంటే ఎక్కువ‌గా మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసేవి ఏవైనా వున్నాయంటే అవి పాట‌లు, పుస్త‌కాలు ఒక్క‌టే.

No comment allowed please