Boris Johnson : భార‌త్ కు రానున్న బోరిస్ జాన్స‌న్

ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్న పీఎం

Boris Johnson  : ఉక్రెయిన్, ర‌ష్యా యుద్దం కొన‌సాగుతున్న త‌రుణంలో భార‌త్ ను ప‌లు దేశాల‌కు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు, ఉన్న‌తాధికారులు సంద‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా యుకె ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్సన్(Boris Johnson )ఈ నెలాఖ‌రున రానున్న‌ట్లు స‌మాచారం.

ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా యూకే – భార‌త్ మ‌ధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చ‌ర్చ‌లు జ‌రిగే ఉంది. ఇప్ప‌టికే జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి భార‌త్ కు వ‌చ్చారు.

మోదీతో భేటీ అయ్యాక భారీ ఎత్తున పెట్టుబ‌డులు డిక్లేర్ చేశారు. అంత‌కు ముందు ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రి మోరిస‌న్ మోదీతో వ‌ర్చువ‌ల్ గా ప్ర‌సంగించారు.

ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌పై ఉన్న సుంకాల‌ను తొల‌గించేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

ఈ త‌రుణంలో బోరిస్ జాన్స‌న్(Boris Johnson )ప‌ర్య‌ట‌న కూడా ఖ‌రారు కావ‌డంతో యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు భార‌త్ అనుస‌రిస్తున్న విదేశాంగ విధానంపై ఫోక‌స్ పెట్టింది.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది లోనే బోరిస్ జాన్స‌న్ ఇండియాకు రావాల్సి ఉంది. కానీ క‌రోనా , త‌దిత‌ర కార‌ణాల రీత్యా ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్ధాంత‌రంగా వాయిదా వేసుకున్నారు.

రిప‌బ్లిక్ డే కు రావాల‌ని భార‌త్ ఆహ్వానం పంపింది. యూకే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జీ 7 దేశాల మీటింగ్ కు హాజ‌రు కావాల‌ని ప్ర‌ధాని మోదీని ఆహ్వానించారు.

ఆరోగ్యం, వాతావ‌ర‌ణం , వాణిజ్యం, విద్య‌, సైన్స్ , టెక్నాల‌జీ , ర‌క్ష‌ణ రంగాల‌కు సంబంధించి యునైటెడ్ కింగ్ డ‌మ్ , ఇండియా తో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు బోరిస్ జాన్స‌న్.

Also Read : స‌మ‌న్వ‌యం కాంగ్రెస్ కు బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!