Boris Johnson : బ్రిట‌న్ ప్ర‌ధాని రేసు నుంచి జాన్స‌న్ అవుట్

ప్ర‌క‌టించిన యుకె మాజీ ప్ర‌ధాన మంత్రి

Boris Johnson : బ్రిట‌న్ లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతోంది. నిన్న‌టి దాకా ప్ర‌ధానమంత్రి రేసులో నిలిచిన మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్(Boris Johnson) ఉన్న‌ట్టుండి పీఎం రేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు పీఎం రేసులో నిలిచిన భార‌త సంత‌తికి చెందిన రిషి సున‌క్ , పెన్నీ మార్డెంట్ ల మ‌ధ్యే పోరు ఉండ‌నుంది.

ఇక ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరిన లిజ్ ట్ర‌స్ 45 రోజుల త‌ర్వాత తన‌కు పాల‌న చేత కాదంటూ చేతులెత్తేసింది. ఆపై పీఎం ప‌ద‌వికి రాజీనామా చేసింది. కొత్త ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరేంత దాకా ఆమెనే ఆప‌ద్ద‌ర్మ పీఎంగా కొన‌సాగుతారు. ఈ త‌రుణంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి గా ప‌ని చేసిన రిషి సున‌క్ కు లైన్ క్లియ‌ర్ అయ్యింది.

అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో 144 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు రిషి సున‌క్(Rishi Sunak) కు ల‌భించ‌డం విశేషం. దాంతో పోటీలో సున‌క్ ముందంజ‌లో కొన‌సాగుతుండ‌గా పెన్నీ మార్డెంట్ వెనుకంజ‌లో ఉన్నారు. ఇక పార్టీ ప‌రంగా ఒకే ఏకాభిప్రాయానికి వ‌స్తే రిషి సున‌క్ ను పార్టీ నాయ‌కుడిగా ఎన్నిక‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

సోమ‌వారం రాత్రి లోపు త‌మ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌నుంది పార్టీ. ఈ త‌రుణంలో పీఎం రేసులో తాను ఉండ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు బోరిస్ జాన్స‌న్. అంత‌కు ముందు తాను బ‌రిలో ఉంటాన‌ని రిష్ సున‌క్ పోటీ నుంచి త‌ప్పు కోవాలంటూ కోరారు. కానీ రిషి సున‌క్ ఒప్పుకోలేదు. పోటీ చేయ‌డం ఖాయ‌డం ప్ర‌క‌టించారు.

Also Read : జిన్ పింగ్ నిజ‌మైన స్నేహితుడు – పీఎం

Leave A Reply

Your Email Id will not be published!