Boris Johnson : రాజీనామాకు బోరీస్ జాన్సన్ ఓకే
అక్టోబర్ దాకా దేశానికి కేర్ టేకర్
Boris Johnson : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసేందుకు ఓకే చెప్పారు. వచ్చే అక్టోబర్ వరకు ప్రభుత్వానికి ఆయన కేర్ టేకర్ గా ఉండనున్నారు.
గత 48 గంటల్లో తాను చివరి దాకా ప్రధానిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడని, కానీ పలువురు మంత్రులు తప్పు కోవడంతో తప్పనిసరిగా రాజీనామా చేయక తప్పలేదు.
ఇవాళ దేశాన్ని ఉద్దేశించి ప్రకటన చేయనున్నారు బోరిస్ జాన్సన్. పార్టీ వార్షిక సమావేశానికి కొత్త కన్జర్వేటివ్ నాయకుడిని నియమించనున్నారు. బోరిస్ జాన్సన్ తన ప్రభుత్వంలో ఇబ్బంది పడడానికి కారణం కీలకమైన మంత్రులు తప్పుకున్నారు.
తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్తగా నియమించిన ఛాన్సలర్ నదీమ్ జహావితో సహా ఇతరులు కూడా ప్రధాన మంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు.
ఇద్దరు క్యాబినెట్ మంత్రులతో పాటు జూనియర్ మంత్రులు కూడా గుడ్ బై చెప్పారు. దీంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది.
దీనికి ప్రధాన కారణం సెక్స్ స్కాండల్ లో కూరుకు పోయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్(Boris Johnson) ప్రయారిటీ ఇవ్వడం చర్చకు దారి తీసింది.
వరుసగా రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉండడంతో యూకేలో ఏం జరుగుతోందననే ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.
ఈ తరుణంలో నిన్నటి దాకా చక్రం తిప్పుతూ వచ్చిన బోరిస్ జాన్సన్ ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పు కోవాల్సిన పరిస్థితి తనంతకు తానే తెచ్చుకున్నారు.
ఇదిలా ఉండగా బోరిస్ జాన్సన్(Boris Johnson) స్థానంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండ బోతున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది.
Also Read : ఉత్తర ఐర్లాండ్ కార్యదర్శి రాజీనామా