Boris Johnson : అక్షరధామ్ ను దర్శించుకున్న బోరిస్ జాన్సన్
పీఎంకు స్వాగతం సీఎం పటేల్, గవర్నర్ ఆచార్య
Boris Johnson : భారత దేశంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్(Boris Johnson) కు అపూర్వ స్వాగతం లభిస్తోంది. బ్రిటన్ నుంచి ఆయన నేరుగా అహ్మదాబాద్ కు చేరుకున్నాడు.
అక్కడి నుంచి మహాత్మాగాంధీ నివసించిన అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు బోరీస్ జాన్సన్(Boris Johnson) . అనంతరం ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆతిథ్యం ఇచ్చారు బ్రిటన్ పీఎంకు.
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం జేసీబీ తయారీల పరిశ్రమను సందర్శించారు బ్రిటన్ పీఎం. గురువారం దేశంలోనే పేరు పొందిన గుజరాత్ లోని అక్షర ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
ఆలయ పూజారులు, అర్చకులు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆయనను ఆహ్వానించారు.
భారత ప్రభుత్వం తనకు అందించిన స్వాగతాన్ని బోరిస్ జాన్సన్ ఆస్వాదించారు. ఆనందంతో పులకించి పోయారు. ఈ సందర్బంగా సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనకు ఆలయ విశిష్టలను తెలియ చేశారు.
సంప్రదాయ నృత్య, సంగీత కార్యక్రమాలకు బ్రిటన్ పీఎంకు స్వాగతం పలకడం విశేషం. ప్రస్తుతం బోరీస్ జాన్సన్ ఆలయ సందర్శన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎంతైనా పీఎం మోదీనా మజాకా కదూ.
ఇదిలా ఉండగా గుజరాత్ ను సందర్శించిన మొట్ట మొదటి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కావడం విశేషం.
Also Read : ధరణి కోసం సద్గురు ప్రయాణం