Boris Johnson : అవిశ్వాస పరీక్షలో నెగ్గిన బోరిసన్ జాన్సన్
ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి
Boris Johnson : పదవి ఉంటుందో ఊడుతుందో లేదోనన్న ఉత్కంఠ మధ్యన ఊపిరి పీల్చుకున్నారు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్. ఆయనపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగి పోయింది.
బోరిస్ జాన్సన్ నెగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విచిత్రం ఏమిటంటే జాన్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది ప్రతిపక్ష పార్టీలు, నేతలు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆయన సొంత పార్టీకి చెందిన సభ్యులే బోరిస్ జాన్సన్ ను టార్గెట్ చేశారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. పార్టీకి సంబంధించిన గేట్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రధాన మంత్రి. కాగా బోరిస్ జాన్సన్ కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగి పోయింది. ఏకంగా బోరిస్ జాన్సన్(Boris Johnson) 63 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు.
తనకు ఎదురే లేదని చాటారు. ప్రపంచ వ్యాప్తంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పై ఫోకస్ పెట్టింది. చివరకు జాన్సన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన అనంతరం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(Boris Johnson) మీడియాతో మాట్లాడారు. తన పనితీరుకు మద్దతుగా 59 శాతం మంది సభ్యులు మద్దతుగా నిలవడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఒక రకంగా ఇది తన పాలన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. నిర్ణయాత్మకమైన ఫలితంగా బోరిస్ అభివర్ణించారు. ప్రధానంగా ప్రజల సమస్యలపై ఇక నుంచి మరింతగా ఫోకస్ పెడతానని చెప్పారు.
Also Read : చమురు దిగుమతులు సబబే – జై శంకర్