Bose Raju Revanth Reddy : రేవంత్ రెడ్డితో బోస్ రాజు భేటీ
తెలంగాణలో ఎన్నికలపై చర్చ
Bose Raju Revanth Reddy : ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన గర్జన సభను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు ఇతర నేతలు ఈ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించాలని నిర్ణయించారు. కనీసం సభకు 4 లక్షల మందికి పైగా తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తరలి వస్తున్నారు తెలంగాణకు. పార్టీ పరిశీలకుడు, ముఖ్య నేత బోస్ రాజు(Bose Raju) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని శత విధాలుగా ప్రయత్నిస్తోంది.
తాజాగా పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డితో భేటీ అత్యంత ఆసక్తిని రేపిందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోస్ రాజు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని పలు సర్వే సంస్థలు వెల్లడించడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరిత జోష్ లో ఉన్నారు.
Also Read : YSRCP Slams : పవన్ పై వైసీపీ షాకింగ్ కామెంట్స్