Rahul Gandhi : బీజేపీ..టీఆర్ఎస్ రెండూ ఒక్కటే – రాహుల్
సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంది. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ ను ఏకి పారేశారు.
ఒకే నాణేనికి ఇరు వైపులా ఉన్న బొమ్మలంటూ ఎద్దేవా చేశారు. భావజాలం వేరైనా వారి ఆలోచనా ధోరణి మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ బయటకు పోట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నాయని కానీ వారి అంతర్గత ఎజెండా మాత్రం పవర్ లోకి రావడం తప్ప మరొకటి లేదన్నారు.
కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేనని మాటలతో మభ్య పెట్టడం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా చెప్పుకునేందుకు లేదని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఎన్నికలు అంటేనే డబ్బులు అనే స్థాయికి తీసుకు వచ్చిన ఘనత ఈ రెండు పార్టీలకే దక్కుతుందన్నారు.
చివరకు ఓటర్లను డబ్బులు తీసుకునే యంత్రాలుగా మార్చేశారని ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. డెమోక్రసీని పాతరేసి కేవలం డబ్బులతో రాజకీయాలు చేయాలని అనుకోవడం దారుణమన్నారు.
ఇక్కడ బీజేపీని విమర్శిస్తున్న కేసీఆర్(CM KCR) ఢిల్లీలో మోదీ చేసే పనులు, చట్టాలను సమర్థిస్తుందని ఇదేరకమైన రాజకీయమని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ధ్వజమెత్తారు.
Also Read : బీజేపీ నేతల మాటలన్నీ బక్వాస్ – కేటీఆర్
TRS and BJP are not political parties, but corrupt businesses that work together to loot people. pic.twitter.com/iq9gG1xAGF
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2022