Botsa Satayanarayana : చంద్రబాబు దొరికిన దొంగ
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satayanarayana : విజయవాడ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satayanarayana). ఏపీ స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు కాజేశారంటూ ఏపీ సీఐడీ ఇప్పటికే స్పష్టం చేసిందని అన్నారు.
Botsa Satayanarayana Slams Chandrababu
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శనివారం విజయవాడ క్యాంపు ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దొరికిన దొంగ అని పేర్కొన్నారు. అందుకే ఏమీ చెప్పలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా నిందారోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు బొత్స సత్యనారాయణ.
ఏపీ సీఐడీ పక్కా ఆధారాలను ఏసీబీ కోర్టులో సమర్పించిందన్నారు. సీమెన్స్ తో ఒప్పందంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థ తన వాటా కింద రూ. 3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
తాము ఎక్కడా అవినీతికి తావు ఇవ్వకుండా చిత్తశుద్దితో పని చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ కావడంపై తెలంగాణ స్పీకర్ చేసిన కామెంట్స్ చేయడం సబబు కాదన్నారు. పోచారం విమర్శల్ని ఖండిస్తున్నామని అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేదని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ.
Also Read : Congress MP’S : ఆ ముగ్గురు ఓటు వేయలేదా..?