Botsa Satyanarayana : జనం బాబును నమ్మరు – బొత్స
ఆయన ఓ చెల్లని నాణెం అంటూ ఫైర్
Botsa Satyanarayana : అమరావతి – ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయనను ఓ చెల్లని నాణెంగా పేర్కొన్నారు.
Botsa Satyanarayana Comments on Chandrababu
ఇచ్చిన మాటల్ని నిలబెట్టు కోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారంటూ మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలతో పాటు ఇంకొందరు కలిసి పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదన్నారు బొత్స సత్యనారాయణ.
వైసీపీ పాలన జనరంజకంగా ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కనిపించకుండా పోతుందన్నారు. ఇప్పటికే జనం మరోసారి జగన్ మోహన్ రెడ్డి పాలనకు పట్టేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి.
చంద్రబాబు నాయుడి సీటుకే దిక్కు లేదని , ఇక టీడీపీ ఎలా గెలుస్తుందని అనుకుంటారంటూ ప్రశ్నించారు. ఓటమి భయంతో తాను రెండు చోట్ల పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.
Also Read : MLC Jeevan Reddy : బీఆర్ఎస్ ఖేల్ ఖతం – జీవన్ రెడ్డి