Botsa Satyanarayana : చంద్రబాబు ఇక నీ డ్రామాలు ఆపు
నిప్పులు చెరిగిన బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana : ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు బతుకంతా అబద్దాలు తప్ప ఒక్కటైనా నిజం చెప్పాడా అని నిలదీశారు. నీ పేరు చెప్పుకునేలా ఒక్క పథకమైనా చెప్పగలవా అని మండిపడ్డారు. ఇన్నినాళ్లు సీఎంగా ఉన్న నీవు రాష్ట్రానికి ఏం చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. పొద్దస్తమానం జగన్ పై ఆడి పోసుకోవడమే తప్పా వేరే పని ఏం లేదా అన్నారు .
చంద్రబాబు పాలన అంతా కరువు కాటకాలకు చిరునామా అని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో జీఎస్డీపీలో మన స్థానం 22వదిగా ఉందని, దీనిని బయటకు చెప్పాలన్నారు బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో ఏపీ టాప్ లో నిలిచిందన్నారు. ఆనాడు వ్యవసాయం దండగ అని అనలేదా చంద్రబాబు ఆ విషయం మరిచి పోయావా అని నిప్పులు చెరిగారు.
కానీ జగన్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని చెప్పారు. ఇవాళ నాడు నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. ఏనాడైనా విద్యా రంగానికి నిధులు కేటాయించావా అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
పొద్దున లేచి నప్పటి నుంచి పడుకునేంత దాకా చంద్రబాబు అబద్దాలు తప్ప ఇంకేమీ మాట్లాడడని అన్నారు. అమరావతి ఏమన్నా దేవేంద్రుని నిలయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా నీ డ్రామాలు కట్టిపెట్టి నిజాలు మాట్లాడాలని సూచించారు.
Also Read : Mahila Panchayat
