Brandon Lewis : ఉత్తర ఐర్లాండ్ కార్యదర్శి రాజీనామా
బోరిస్ జాన్సన్ కు మరో బిగ్ షాక్
Brandon Lewis : సెక్స్ స్కాండల్ లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వడం చివరకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పదవికి ఎసరు తెచ్చేలా చేసింది.
ఇప్పటి వరకు యూకె కేబినెట్ లో ముగ్గురు కీలక మంత్రులు గుడ్ బై చెప్పేశారు. గురువారం మరో బిగ్ షాక్ తగిలింది ప్రధాన మంత్రికి. యూకె లోని ఉత్తర ఐర్లాండ్ కార్యదర్శి బ్రాండన్ లూయిస్ బోరిస్ జాన్సన్ ను విడిచి పెట్టారు.
వరుస రాజీనామాల తర్వాత ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తీవ్ర రాజకీయ ఒత్తిడికి లోనయ్యారు. ఈ మేరకు తాను తప్పుకుంటున్నంట్లు ఇవాళ ప్రకటించారు.
ఆయన రిజైన్ తో మంగళవారం నుండి నిష్క్రమించిన జాన్సన్ క్యాబినెట్ లోని మూడో సీనియర్ సభ్యుడు కావడం విశేషం. భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు.
పాకిస్తాన్ కు చెందిన సాజిద్ జావిద్ ఆరోగ్య కార్యదర్శి పదవికి గుడ్ బై చెప్పేశారు. వారిని అనుసరిస్తూ జూనియర్ మంత్రులు, ఇతరులు తమంతకు తాము తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ మైనార్టీలో పడి పోయే ప్రమాదానికి దిగజారింది. ఇక ఉత్తర ఐర్లాండ్ లోని బ్రెక్సిట్ అనంతర వాణిజ్యాన్ని నియంత్రించేందుకు బ్రస్సెల్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం రూల్స్ మార్చాలంటూ లండన్ కోరింది.
బ్రాండన్ లూయిస్(Brandon Lewis) 2020 నుంచి పని చేస్తూ వచ్చిన లూయిస్ తప్పు కోవడం చర్చకు దారి తీసింది. జాన్సన్ ను కలిసిన సీనియర్ కన్జర్వేటివ్ మంత్రుల బృందంలో లూయిస్ కూడా ఉన్నారు.
Also Read : హింసోన్మాదం దేశానికి ప్రమాదం – కమలా హారీస్