Gujarat Bridge : గుజరాత్ లో బ్రిడ్జి కూలి..40 మంది మృతి
సహాయక చర్యలు చేపట్టాలని పీఎం ఆదేశం
Gujarat Bridge : గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం కేబుల్ వంతెన కూలిన ఘటనలో 40 మంది మృతి చెందారు. 100 మందికి పైగా చిక్కుకు పోయినట్లు సమాచారం. కేబుల్ వంతెన కూలి పోయినప్పుడు దానిపై దాదాపు 500 మంది ఉన్నారు. మరో వంద మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలిసింది.
ఈ ఘోరమైన ప్రమాదం గుజరాత్ లోని మోర్బీలో జరిగింది. కేబుల్ వంతెన ఉన్నట్టుండి తెగి పోవడంతో(Gujarat Bridge) ఒక్కసారిగా దానిపై ఉన్న వారంతా చిక్కుకు పోయారు. మరికొందరు భయంతో నీళ్లల్లోకి దూకారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నారు.
ఇవాళ రూ. 22,000 కోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి. ఈ తరుణంలో విషయం తెలుసుకున్న వెంటనే మోదీ సహాయక చర్యలు చేపట్టలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం చీకటి ఉండడంతో ఎంత మంది చని పోయి ఉంటారనేది ఇంకా తెలియ రాలేదు.
ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని రక్షించే ప్రయత్నాలలో అనేక మంది స్థానికులు కూడా చేరారు. సీఎం భూపేంద్ర పటేల్ తో కూడా మాట్లాడి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. గుజరాత్ హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవి మోర్బీకి బయలు దేరారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి పీఎం సహాయ నిధి కింద రూ. 2 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరొకి రూ. 50,000 చొప్పున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు , గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఇస్తున్నట్లు వెల్లడించింది.
Also Read : సౌరశక్తి తయారీలో భారత్ టాప్ – మోదీ