Brij Bhushan Singh : రైతుల మద్దతుపై బ్రిజ్ భూషణ్ గుస్సా
విచారణ నివేదిక వచ్చేంత దాకా ఆగలేరా
Brij Bhushan Singh : తనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన దీక్షకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు మద్దతు ఇవ్వడంపై సంచలన కామెంట్స్ చేశారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ . సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రైతులు ఎందుకు ఆగడం లేదంటూ ప్రశ్నించారు.
ఇప్పటికే తనపై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారని ఆ నివేదిక ఇప్పటి దాకా రాలేదన్నారు. ఇంత లోపు తనతో మాట మాత్రం చర్చించకుండా రెజ్లర్లకు ఎలా మద్దతు ఇస్తారంటూ వాపోయాడు. ఆయన వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 28న తనపై ఢిల్లీ పోలీసులపై రెండు కేసులు నమోదు చేశారు. రైతు నాయకులు వాళ్లకు మద్దతు ఇచ్చి తప్పు చేయవద్దని కోరాడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh).
తాను నిర్దోషినని, ఇప్పటి వరకు తాను ఏ తప్పు చేయలేదన్నాడు. మహిళలు ఆరోపిస్తున్నట్లుగా తనకు అంత లైంగిక సామర్థ్యం లేదన్నాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ముందు మీ ఊర్లల్లో బాలికలను, యువతులను అడగాలని కోరాడు ఎంపీ. విచారణ పూర్తయ్యాక నేను మీ వద్దకు వస్తా. నేను దోషిగా తేలితే నన్ను బూట్లతో కొట్టి చంపాలన్నాడు డబ్ల్యూఎఫ్ఐ.
Also Read : సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలి