దేశ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితిని విస్తరించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు ఆ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు కార్యాలయ భవనం శరవేగంగా తయారవుతోంది. ఈ మేరకు వచ్చే నెల మే 4న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారికంగా ఏప్రిల్ 27న జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశంలో పార్టీ చీఫ్ , సీఎం ప్రకటించనున్నారు.
పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు, యాగాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయారు నిర్వాహకులు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లారు. ఇక ఎంపీ సంతోష్ రావు కూడా అక్కడే ఉంటూ పనులు చక్కదిద్దుతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించాలనే దానిపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలతో వివిధ రంగాలకు చెందిన వారిని ఆహ్వానించనున్నట్లు టాక్.
పార్టీ జాతీయ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు గాను తాత్కాలికంగా ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డ్ లో ఉన్న అద్దె భవనంలో తాత్కాలికంగా ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇప్పటికే దేశమంతటా విస్తరించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తనకు ఛాన్స్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో ఖర్చంతా నాదేనంటూ సీఎం కేసీఆర్ చెప్పారంటూ బాంబు పేల్చారు.