Akula Lalitha : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై
ఆకుల లలిత పార్టీకి రాజీనామా
Akula Lalitha : నిజామాబాద్ – అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగిలిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Akula Lalitha Say Good Bye to BRS
తాజాగా రాష్ట్రంలో వచ్చే నెల నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఆకుల లలిత(Akula Lalitha) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ఆమెకు మొండి చేయి చూపారు. ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
తాను ముందు నుంచీ పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని, కానీ సీఎం కావాలని తనను పక్కన పెట్టారంటూ ఆరోపించారు. అందుకే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వక పోవడం దారుణమన్నారు. కష్టపడి పని చేసిన వాళ్లను పట్టించుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Komatireddy Venkat Reddy : బాబుకు మద్దతిస్తే తప్పేంటి
