KCR CM : దేశమంతటా బీఆర్ఎస్ జెండా ఎగరాలి
కర్ణాటకలో ఇక బీఆర్ఎస్ దే హవా
KCR CM : టీఆర్ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. విజయ దశమి రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ప్రకటించారు.
దేశమంతటా బీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. త్వరలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పార్టీని మారుస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయాలు ఓ ఆట అని కానీ తనకు మాత్రం బిగ్ టార్గెట్ అని వెల్లడించారు కేసీఆర్(KCR CM). ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు.
దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించా. కానీ ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దానిని పరిగణలోకి తీసుకుని తాను భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చడం జరిగిందని చెప్పారు కేసీఆర్.
ప్రస్తుతం కొలువు తీరిన మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు సీఎం. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కావాలన్నారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను తీసుకు వచ్చినట్లు చెప్పారు. అన్నదాతల సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు కేసీఆర్.
అపారమైన వనరులు ఉన్నా ఎందుకని ఈరోజు వరకు దేశం ఇతర దేశాల నుంచి వస్తువులను , ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించారు కేసీఆర్(KCR CM). తమ ముందున్న టార్గెట్ కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలేనని డిక్లేర్ చేశారు.
Also Read : బీఆర్ఎస్ ఆమోదం కోసం ఈసీకి లేఖ