KCR BRS : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి
దేశమంతటా ఉచిత విద్యుత్..దళిత బంధు
KCR BRS : రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి చరిత్ర సృష్టించ బోతోంది. పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. తాను కన్న కల సాకారం అయ్యేందుకు ఎంతో దూరంలో లేదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్ గా తనకు చాలా సంతోషం ఉందన్నారు.
ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. కానీ వాటిని గుర్తించి వినియోగించుకునే తెలివి ఆయా పార్టీలకు, నేతలకు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అందుకే తాను టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చానని అన్నారు కేసీఆర్. ఇవాళ ప్రగతి భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రితో పాటు పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని (KCR BRS) జోష్యం చెప్పారు. తాము పవర్ లోకి వచ్చాక దేశమంతటా ఉచితంగా విద్యుత్ ఇస్తామని, దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు. రూ. 1.45 కోట్లతో దేశమంతటా ఉచితంగా విద్యుత్ ఇవ్వవచ్చని చెప్పారు కేసీఆర్.
గత ఎనిమిది సంవత్సరాలుగా మోదీ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను , సంస్థలను అమ్మకానికి పెట్టారని లేదంటే ఆసాములకు అప్పనంగా లీజుకు ఇచ్చే పనిలో పడ్డాడని ఆరోపించారు కేసీఆర్. దేశంలోని ప్రతి ఏటా 25 లక్షల మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు సీఎం.
మీది ప్రైవేటైజేషన్ మాది నేషనలైజేషన్ అన్నారు కేసీఆర్ . భారత దేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 6 లక్షల 64 వేల గ్రామాల్లో మన కమిటీలు ఏర్పాటు కావాలన్నారు.
Also Read : చివరి దాకా కేసీఆర్ తోనే ఉంటా – రావెల