BRS Floor Leader : గులాబీ శాసన సభా పక్ష నేత ఎవరో
హరీశ్ రావు వర్సెస్ కేటీఆర్
BRS Floor Leader : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉన్న పవర్ ను పోగొట్టుకుంది భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS). 119 సీట్లకు గాను 64 సీట్లు హస్తానికి రాగా దాని మిత్ర పక్ష పార్టీ సీపీఐకి ఒక సీటు దక్కింది. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. ఓటమి అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షంగా సమస్యలను లేవనెత్తుతామని పేర్కొన్నారు.
BRS Floor Leader Confirmation
ఇక పార్టీ పరంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు గజ్వేల్ లోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ బాస్ సమీక్షించారు. కొత్తగా ఎన్నికైన వారు దొర ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ తో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , హరీశ్ రావు , మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా ఎవరు బీఆర్ఎస్ పార్టీ పరంగా శాసన సభా పక్ష నేతగా ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే కేటీఆర్ లేదా తన్నీరు హరీశ్ రావు ఇద్దరిలో ఎవరికి గులాబీ బాస్ అప్పగిస్తారనేది ఆ పార్టీ నేతల్లో చర్చకు వస్తోంది.
Also Read : Baba Balak Nath : ఎవరీ బాబా బాలక్ నాథ్